బహిష్టు సమయాల్లో తలెత్తే నొప్పికి చెక్ పెట్టే మటన్.. (video)

గురువారం, 28 మార్చి 2019 (12:49 IST)
నాన్‌వెజ్ ప్రియులకు మటన్ అంటే చాలా ఇష్టం. అయితే పరిమిత పరిమాణంలో తీసుకుంటే అది మన శరీరానికి మేలు చేస్తుంది. మటన్‌లోని పోషక విలువలు, సుగుణాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మటన్‌లో అధికంగా ప్రొటీన్లు ఉంటాయి. ఐరన్ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. వీటి వలన శరీరానికి మంచి పోషణ అందుతుంది. 
 
ఇందులో బి1, బి2, బి3, బి9, బి12 విటమిన్లు ఉంటాయి. విటమిన్‌-ఇ, కె, సహజ ఫ్యాట్స్‌, కొలెస్ట్రాల్‌, అమినోయాసిడ్స్‌, ఖనిజాలు (మాంగనీసు, కాల్షియం, జింక్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, సెలేనియం), ఎలక్ట్రోలైట్స్ (పొటాషియం, సోడియం), ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఒమేగా6 ఫ్యాటీయాసిడ్స్‌ ఉంటాయి. 
 
మటన్‌లో ప్రొటీన్లు, న్యూట్రియంట్లు, బి12 బాగా ఉండడం వల్ల కొవ్వును కరిగించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. బి12 ప్రమాణాలు అధికంగా ఉండడం వల్ల ఎర్రరక్తకణాలు ఏర్పడతాయి. అంతేకాదు దెబ్బతిన్న కణాలు సైతం పునరుద్ధరించబడతాయి. గర్భిణీ స్త్రీలు తమ డైట్‌లో మటన్‌ని భాగం చేసుకుంటే పుట్టే బిడ్డలకు న్యూరల్‌ ట్యూబ్‌ లాంటి సమస్యలు రావు. 
 
మటన్‌లో బీకాంప్లెక్స్‌, సెలినియం, కొలైన్‌ వంటివి సమృద్ధిగా ఉండడం వల్ల క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండొచ్చు. బహిష్టు సమయాల్లో తలెత్తే నొప్పి నుంచి మటన్‌ సాంత్వననిస్తుంది. అలాగే బహిష్టు సమయాల్లో మహిళలకు అవసరమైన ఐరన్‌ని పుష్కలంగా అందిస్తుంది. మటన్‌ తినడం వల్ల సొరియాసిస్‌, ఎగ్జిమా, యాక్నే వంటి చర్మ సమస్యలను అధిగమించొచ్చు. 
 
నిత్యం మటన్‌ని సరైన మోతాదులో తింటే టైప్‌-2 డయాబెటిస్‌, ఇన్ఫెక్షన్లు, ఇతర జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు. మటన్‌లో అధిక పొటాషియం, తక్కువ సోడియంలు ఉండడం వల్ల రక్తపోటు, స్ట్రోకు, మూత్రపిండాల సమస్యలు తొందరగా తలెత్తవు. మటన్‌లో కాల్షియం బాగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను అందజేస్తూ వాటిని దృఢంగా ఉంచుతుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వేపాకు పొడి, పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?