Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిలకడ దుంపలు తింటే ఇవన్నీ అందుతాయి...

చిలకడ దుంపలు తింటే ఇవన్నీ అందుతాయి...
, బుధవారం, 27 మార్చి 2019 (18:01 IST)
చిలకడదుంప అనేది, ఎల్లపుడు లభించే, చవకైన, ప్రకృతిసిద్ధ మరియు అధిక మొత్తంలో బీటా కెరోటిన్‌లను కలిగి ఉండే ఆహార పదార్థంగా చెప్పవచ్చు. దీనిని తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. పిండిపదార్థాలను కలిగి ఉండి, అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటుంది. ఇవి పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చిలకడ దుంపలు తింటే కలిగి ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. హోమోసిస్టిన్ శరీరంలో సహజంగా ఉత్పత్తి చెంది, జీర్ణాశయ సమస్యలను మరియు గుండె వ్యాధులను కలుగ చేస్తుంది. చిలకడదుంప అధిక మొత్తంలో బి 6 విటమిన్లను కలిగి ఉన్నందు వలన, ఇది హోమోసిస్టిన్ ఉత్పత్తిని తగ్గించి జీర్ణాశయ మరియు గుండె వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
2. చిలకడదుంప పుష్కలమైన విటమిన్ సిని కలిగి ఉండి, జలుబు, ఫ్లూలను తగ్గించటమే కాకుండా, దంతాలు, ఎముకల ఏర్పాటు, రక్త కణాల మరియు కొల్లజన్ ఉత్పత్తిలను పెంచుతుంది. కొల్లాజన్, చర్మ కణాలకు స్టితిస్థాపకతను చేకూర్చి, ఒత్తిడి మరియు క్యాన్సర్ వ్యాధిని కలుగచేసే కారకాల చర్యలను వ్యతిరేకిస్తుంది.
 
3. చిలకడ దుంప, విటమిన్ డిని పుష్కలంగా కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది, అంతేకాకుండా, గుండె కండరాలు బలంగా ఉండేలా నిర్మిస్తుంది. విటమిన్ డి థైరాయిడ్ గ్రంధి, దంతాలు, ఎముకలు, కండరాలు మరియు చర్మం వంటి భాగాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
 
4. శరీరానికి కావాల్సిన మెగ్నీషియం చిలకడదుంపలో పుష్కలంగా ఉంటుంది. ఈ మూలకం యాంటీస్ట్రెస్ మరియు రిలాక్షంట్‌గా పని చేస్తుంది. అంతేకాకుండా, గుండె, రక్తం, ధమనుల, నరాల మరియు కండరాలు తమవిధులను సరిగా నిర్వహించేలా ప్రోత్సహిస్తుంది.
 
5. వివిధ రకాల విటమిన్ మరియు మినరల్‌లతో పాటూ పొటాషియం, కాల్షియం వంటి మూలకాలు చిలకడదుంపలో ఉన్నాయి మరియు ఇవి కడుపు (జీర్ణాశయంలో) ఏర్పరిచే అల్సర్లను తగ్గించి వేస్తాయి. ఫైబర్లను అధిక మొత్తంలో కలిగి ఉన్న, ఈ పిండి పదార్థాలతో కూడిన ఆహారం, అసిడిటీ సమస్యలను మరియు మలబద్దకం వంటి వాటిని కలుగకుండా చూస్తాయి.
 
6. విటమిన్ ఎ లేదా బీటా కెరోటిన్ వంటివి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయని మనకు తెలిసిందే. విటమిన్ ఎ యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉండి, క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పని చేయటమే కాకుండా, అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదాల నుండి, మరియు వీటి వలన ప్రమాదానికి గురైన కణాలను భర్తీ చేయటానికి ఈ విటమిన్ సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భర్త శృంగారం చేయమంటే టైమ్ లేదంటాడు.. ఏం చేయాలి?