Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో తాటి ముంజలు తినాల్సిందే... ఎందుకంటే?

Advertiesment
వేసవిలో తాటి ముంజలు తినాల్సిందే... ఎందుకంటే?
, మంగళవారం, 26 మార్చి 2019 (21:47 IST)
వేసవికాలంలో తాటిముంజలు విరివిగా లభిస్తాయి. శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, బి, సి, ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. తాటిముంజలలో ఉండే పొటాషియంశరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. దీనితో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. తాటిముంజలులో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చర్మ అందాన్ని ఇనుమడింప చేసే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
 
1. బరువు తగ్గాలనుకునేవారు తాటిముంజలు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే అధిక నీటిశాతం, మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగించి ఆకలి కానివ్వవు. దాంతో చాలా తేలికగా బరువు తగ్గవచ్చు.
 
2. ఇందులో చల్లదనం వల్ల శరీరానికి కావల్సినంత చల్లదన్నాన్ని అందిస్తుంది. వేసవిలో చికెన్ పాక్ వస్తే, తాటిముంజలు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
3. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. తాటి ముంజ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ముసలి వాళ్లకి చాలా మంచిది. 
 
4. వేసవికాలంలో, ఇతర సీజన్ల కంటే ఈ సీజన్ లో ఎక్కువ అలసటకు గురి అవుతుంటారు. అందుకు ప్రధాన కారణం, శరీరం నుండి నీటిని కోల్పోవడం వల్ల వచ్చే నీరసం, అలసటను తాటి ముంజలు నివారించి, తక్షణ శక్తిని అందిస్తుంది.
 
5. గర్భిణీలు తాటి ముంజలు తినడం వల్ల వారిలో మలబద్దక సమస్య నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా ఎసిడిటి  సమస్యను కూడా నివారిస్తుంది. 
 
6. తాటి ముంజల్లో అధిక నీటిశాతం ఉండటం వల్ల దీని వల్ల శరీరానికి తగినంత తేమ అందించి, చర్మంను, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు గొప్పగా సహాయపడుతుంది.
 
7. కాలిన గాయాలకు,మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించేందుకు తాటిముంజల్నీ తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకొని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిల్ని ఇలా పిలిస్తే ఫిదా అయిపోతారట..!