Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంతకముందులా శృంగారంలో పాల్గొనలేకపోతున్నారా? ఇవి తీసుకుంటే సరి...

ఇంతకముందులా శృంగారంలో పాల్గొనలేకపోతున్నారా? ఇవి తీసుకుంటే సరి...
, సోమవారం, 25 మార్చి 2019 (20:50 IST)
చాలామంది అప్పుడప్పుడు ఇలాంటి అనుభవమే ఎదుర్కునే ఉంటారు. శృంగారం మీద ఆసక్తి తగ్గడానికి మానసికపరమైన సమస్యలతో పాటు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. కానీ చాలామందిలో ఎటువంటి సమస్యలు కనపడవు. అయినా వారిలో ఆ విషయంలో నిస్సత్తువ ఆవరిస్తుంది. క్రమంతప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండటంతో పాటు మీరు తీసుకునే ఆహారంలో ఈ క్రిందవి తప్పకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే ఇక ఆ శక్తికి తిరుగుండదు. అవేంటో తెలుసుకుందాం.
 
1. గింజధాన్యాలు... బాదం, జీడిపప్పు, అక్రోట్స్ వంటి  గింజలు క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు సంతాన సామర్థ్యాలను పెంచే సెలీనియం, జింక్‌తో పాటు బోలెడన్ని పోషకాలు ఉంటాయి. వీటితోపాటు మెదడులో డొపమైన్ స్థాయలు పెంచడానికి గింజ ధాన్యాలు దోహదం చేస్తాయి. డొపమైన్ కోరికను పెంచడంతో ఆసక్తి పెరుగుతుంది.
 
2. కోడిగుడ్లు... రోజంతా పనిచేసి అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం కావచ్చు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లు త్వరగా అలసిపోకుండా చూస్తాయి. కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకోవడానికి తోడ్పడతాయి. స్తంభన లోపం బారిన పడకుండా చూసే ఆమైన్ ఆమ్లాలు గుడ్లులో లభిస్తాయి రోజూ ఉదయం ఒక గుడ్డు తీసుకుంటే సరిపోతుంది.
 
3. స్ట్రాబెర్రీ.... వీటి గింజల్లో జింక్ మోతాదు ఎక్కువ. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. కోరికనూ ఉద్దీపింపజేస్తుంది. మిగతా పండ్ల మాదిరిగా కాకుండా స్ట్రాబెర్రీలను గింజలతో పాటు తింటూ ఉంటాం కాబట్టి జింక్ కూడా పుష్కలంగా లభిస్తుందన్నమాట. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తాయి. ఫలితంగా స్తంభన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.
 
4. కాఫీ... ఓ కప్పు కాఫీలో లభించేటువంటి కెఫైన్‌ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. బ్లడ్ పంపింగ్‌ను మెరుగుపరిచి ఫ్యాట్ స్టోర్స్‌ను విడుదల చెయ్యడం ద్వారా ఇది శృంగారంలో రాత్రికి సరిపడా శక్తిని ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనియన్ చికెన్ గ్రేవీ వంటకం ఎలా చేయాలంటే...