Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకుని చప్పరిస్తే..?

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (09:55 IST)
భారతీయ వంటకాల్లోని మసాలాలు రుచికోసమే కాకుండా వాటిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నల్ల మిరియాలను మసాలాగానే కాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం వలన అవి క్యాలరీలు బర్న్ చేసి కొత్త ఫ్యాట్ సెల్స్ రాకుండా చూస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కె, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
సాధారణంగా మిరియాలు ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటును భరించగలం అనుకునేవాళ్లు ప్రతిరోజూ ఉదయం ఒకటీ రెండు నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకుని చప్పరించవచ్చు. ఇలా రోజూ క్రమంగా చేస్తుంటే శరీరంలోని మెటబాలిజం క్రమబద్ధం అవుతుంది. చల్లదనం కోసం చేసే సలాడ్స్‌పైన వీటిని చల్లాలి. దీనివలన సలాడ్ రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
 
నల్ల మిరియాల పొడిని టీలో వేసుకుని తాగొచ్చును. గ్లాస్ నీటిలో ఒక చుక్క ఒరిజిన్ బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను వేసుకుని ఉదయం అల్పాహారానికి ముందు తాగితే బరువు తగ్గాలనుకునేవారికి ఫలితం కనిపిస్తుంది. ఈ ఆయిల్‌ను సలాడ్ డ్రెస్సింగ్‌గా కూడా వాడొచ్చు. ఇవి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను పెంపొందించి, శరీరంలో కొత్త ఫ్యాట్ సెల్స్‌ను తగ్గిస్తాయి. అందుకే సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను డైట్‌లో చేరిస్తే మంచిది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments