Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధుమేహం అదుపు తప్పితే.. ఏమవుతుంది..?

మధుమేహం అదుపు తప్పితే.. ఏమవుతుంది..?
, గురువారం, 28 ఫిబ్రవరి 2019 (10:24 IST)
మధుమేహాన్ని తీపి శత్రువు అని పిలుస్తుంటాం. కానీ చక్కని అవగాహనతో ఈ రుగ్మత ప్రతికూలతలను ఎదుర్కోగలిగితే మధుమేహం తీపి శత్రువు కాదు మిత్రుడు అని అర్థమవుతుంది. మిగతా వాటితో పోలిస్తే పారదర్శకంగా ఉండి, శరీరంలోని ఒడుదొడుకులను అద్దంలో ప్రతిబింబంలా చూపించే ఒకే ఒక్క రుగ్మత మధుమేహం..
 
మధుమేహం అదుపు తప్పితే కంట్లో ఉండే చిన్న రక్తనాళాలు చిట్లి రెటీనా పాడవుతుంది. దీంతో అంధత్వం రావొచ్చు. ఈ సమస్యలో లక్షణాలేవి కనిపించవు. రెటినోపతిలో చాప కింద నీరులా జరగాల్సిన నష్టం జరిగిపోతూ హఠాత్తుగా కంటి చూపు పోతుంది. ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే.. ముందుస్తు పరీక్ష ఒక్కటే మార్గం.
 
కంటి చూపు బాగుంది కాబట్టి నా కళ్లకేం ప్రమాదం లేదని మాత్రం మధుమేహులు అనుకోకూడదు. కంట్లో డ్రాప్స్ వేసి 15 నిమిషాలు కూర్చోబెట్టి కంటిని పరీక్ష చేస్తే రెటీనోపతి ఉందా.. ఏ దిశలో ఉంది.. అనే విషయాలు వైద్యులు తేలిగా కనిపెట్టేస్తారు. కాబట్టి ఏడాదికోసారి తప్పనిసరిగా మధుమేహులు కంటి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.
 
పెద్ద రక్తనాళాలతో సంబంధం ఉండే మూత్రపిండాలు మధుమేహం అదుపు తప్పితే దెబ్బ తింటాయి. రక్తంలోని చక్కెర నేరుగా సరఫరా అవుతూ ఉంటే మూత్రపిండాల నుండి ప్రోటీన్స్ లీక్ అవడం మొదలు పెడతాయి. ఇదే కొనసాగితే మూత్రపిండాలు పాడై పని చేయకుండా పోతాయి. అప్పుడి డయాలసిస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ సమస్యలోనూ చివరి దశ వరకూ లక్షణాలేవీ ఉండవు. కాళ్ల వాపులు కనిపించినా అప్పటికే మూత్రపిండాల సమస్య చివరి దశకు చేరుకుందని అర్థం. మూత్రపిండాలను సంరక్షించుకోవాలంటే ప్రోటీన్స్ లీకేజ్‌ను ముందుగానే గుర్తించి దాన్ని నియంత్రించే చికిత్స తీసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యానికి అందానికి ద్రాక్ష... ఇవి తెలుసుకుంటే?