Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్యానికి అందానికి ద్రాక్ష... ఇవి తెలుసుకుంటే?

ఆరోగ్యానికి అందానికి ద్రాక్ష... ఇవి తెలుసుకుంటే?
, బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (22:24 IST)
ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో మంచివన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటివాటిలో ద్రాక్షని ఆహారంలో తీసుకోవడ వల్ల కలిగే లాభాలు ఎన్నో. అత్యంత పోషక విలువలు కలిగి ద్రాక్ష ఆరోగ్యాన్ని అంధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడంలో ద్రాక్షపండు ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ద్రాక్షలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. ద్రాక్షలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో ద్రాక్షలో ఉండే ఫైటో ట్యూట్రియెంట్స్ బాగా పని చేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండడానికి ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. పాలీఫెనోల్స్, రెవెవర్ట్రాల్ కూడా ద్రాక్షలో అధికంగా ఉంటాయి. రక్తపోటు తగ్గించే గుణాలు ద్రాక్షలో ఉంటాయి.
 
2. ద్రాక్షలంటే విటమిన్ సి గుర్తు వస్తుంది. కానీ సి-విటమిన్‌తో పాటుగా విటమిన్ ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. ఫ్లేవినాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. వయసు వల్ల కలిగే ముడతలను తగ్గిస్తాయి.
 
3. ద్రాక్ష కళ్లకు చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతంగా ద్రాక్ష పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తరచూ వస్తుంటే కనుక ప్రతి రోజూ ఉదయాన్నే ద్రాక్షరసాన్ని పరకడుపున తీసుకోవాలి. అయితే అందులో నీళ్ళు కలపకూడదు.
 
4. చాలా మంది అసిడిటితో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు, ఒక గ్లాసు తాజా ద్రాక్షరసంను ప్రతి రోజూ త్రాగడం వల్ల ఇది అసిడిటిని తగ్గిస్తుంది. తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో చీకాకు కలిస్తుంటే ద్రాక్ష రాసాన్ని కానీ లేదా ద్రాక్షపండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తిని అరికట్టడానికి సహాపడుతుంది. 
 
5. ద్రాక్ష మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. ఇందులోని రెవెవర్ట్రాల్ కళ్లకు ఎంతో తోడ్పడుతుంది. మెదడు ప్రతిస్పందనలను వేగవంతం చేసే గుణం ద్రాక్షకు ఉంటుంది. ఇది అల్జీమర్స్ ను పోగొట్టగలదు.
 
6. ద్రాక్షరసం వల్ల ఆరోగ్యం ప్రయోజనం మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు దాక్ష రసం త్రాగడం వల్ల ఒక అందమైన, ప్రకాశవంతమై చర్మాన్ని సహజంగా అందిస్తుంది.
 
7. జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ రక్తప్రసరణను పెంచుతుంది దాంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారం వద్దకు వచ్చేసరికి రాక్షసిలా మారుతోంది... ఏం చేయాలి?