రోజువారీ ఆహారంలో భాగంగా కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్కొక్క రకం కూరగాయలో రకరకాల పోషకాలు, మినరల్స్ ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలు నిర్వహించడంలో వాటికి ఒక్కోరకమైన ప్రాధ్యానం ఉంటుంది. కొన్ని కూరగాయను వండకుండానే జ్యాస్ చేసుకుని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
క్యారెట్ జ్యూస్:
క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపుతుంది. దాంతోపాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది. ఈ జ్యూస్ తరచు తీసుకోవడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. అలానే అధిక బరువు కూడా తగ్గుముఖం పడుతుంది. కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. కీళ్ల వ్యాధులు ఉన్నవారు రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే మంచిది.
దానిమ్మ జ్యూస్:
దానిమ్మ జ్యూస్ చర్మాన్ని సంరక్షించడంలో, క్యాన్సర్ గుణాలను పంపడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించి, నివారించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి. డయాబెటిస్ వ్యాధులకు ఇతర పండ్లను కాకుండా, దానిమ్మరసాన్ని సిఫారసు చేయవచ్చు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
ద్రాక్ష పండ్ల రసం:
ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. క్రమంగా ఈ జ్యూస్ తాగడం వలన చర్మం సురక్షితంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి. ఇవి రక్తంలో గడ్డలు ఏర్పడకుండా నివారిస్తుంది.