Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మల్లెపూల లాంటి తెల్లటి అన్నం కావాలా? ఐతే ఇది తెలుసుకోండి...

Advertiesment
మల్లెపూల లాంటి తెల్లటి అన్నం కావాలా? ఐతే ఇది తెలుసుకోండి...
, గురువారం, 28 ఫిబ్రవరి 2019 (20:10 IST)
ముడిబియ్యం లేదా దంపుడు బియ్యంతో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు. కానీ ఒంటికి మాత్రం కచ్చితంగా మంచిది. బియ్యాన్ని పాలిష్‌ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్థం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్‌ విటమిన్లు పోతున్నాయి. 
 
గోధుమరంగు బియ్యంలో ఉన్న సెలీనియం పెద్దపేగుకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు, జీర్ణవాహికలో క్యాన్సర్‌ కారక రసాయనాలను బయటకు పంపుతుంది. ఈ రకంగా పెద్దపేగు కాన్సర్‌ నుండి కాపాడుతుంది. ముడిబియ్యం తీసుకోవడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. గోధుమరంగు బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రియంట్‌ లిగ్నాన్‌ రొమ్ము క్యాన్సర్‌, గుండె జబ్బులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. వయసు మళ్లిన మహిళలపై జరిపిన అధ్యయనంలో ముడి బియ్యాన్ని తినడం వల్ల ఎంటరోల్యాక్టోన్‌ స్థాయి పెరుగుతుందని, దీనివల్ల రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువని తెలిసింది.
webdunia
 
2. ముడి బియ్యపు ఊక నుండి లభ్యమయ్యే నూనె, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ముడి బియ్యంలో ఉండే పీచూ ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పీచు సమృద్ధిగా ఉండటం వల్ల ముడిబియ్యం గుండెజబ్బు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. టెంపుల్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ముడిబియ్యం తిన్నందున రక్తపోటు తగ్గించడంతో పాటుగా ధమనులలో కొవ్వు పేరుకోకుండా చేసి, గుండెజబ్బులు రాకుండా కాపాడుతుందని కనుగొన్నారు. 
 
3. ముడి బియ్యంలో పీచు సమృద్ధిగా ఉన్నందున, అదనపు కేలరీలు తీసుకోకుండా చూడటమేకాక ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేట్లు చేస్తుంది. దీనితో ఎక్కువ ఆహారం తీసుకోలేం. హార్వర్డ్‌ పరిశోధకుల అధ్యయనం మేరకు పీచు ఎక్కువగా ఉండే బియ్యం తినే మహిళల శరీర బరువు సాధారణంగా ఉంటుందని తేలింది. పీచు సమృద్ధిగా ఉన్నందున ముడిబియ్యం ఎంతో ప్రయోజనకారి. ఇది పేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. 
 
4. ముడి బియ్యంలో ఉన్న పీచు రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన మెగ్నీషియం ముడిబియ్యంలో సమృద్ధిగా ఉంటుంది. కప్పు ముడిబియ్యంలో దాదాపు 21 శాతం మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి, క్యాల్షియాన్ని గ్రహించడానికీ అవసరం. ముడిబియ్యంలో మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నందున ఉబ్బసం వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అనేక అధ్యయనాల్లో తేలిందేమంటే ముడిబియ్యంలోని మెగ్నీషియం ఉబ్బసంతో బాధపడేవారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది. ముడిబియ్యంలోని సెలీజినయమూ ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
 
5. ముడిబియ్యం పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. దీనిలో ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థకు అవసరమైన మాంగనీసు సమృద్ధిగా ఉంది. రోజుకు మూడుసార్లు ఈ బియ్యంతో చేసిన ఆహారం తీసుకోవలసిందిగా నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అరకప్పు ముడిబియ్యం రోజువారీ పోషకాహార అవసరాలను తీరుస్తుందని చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ వడలు చాలా టేస్ట్... ఎలా చేయాలో తెలుసా?