ఫిఫా వరల్డ్ కప్ 2018 : నేటి నుంచి నాకౌట్ పోటీలు

రష్యా వేదికగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగుతున్న ఫిఫా ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గ్రూప్‌ దశ ముగిసింది. ఇక శనివారం నుంచి ఉత్కంఠ భరిత నాకౌట్‌ సమరం ప్రారంభంకానుంది. తొలి ప్రీక్వార్టర్స్‌లో అర్జెంట

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (09:36 IST)
రష్యా వేదికగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగుతున్న ఫిఫా ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గ్రూప్‌ దశ ముగిసింది. ఇక శనివారం నుంచి ఉత్కంఠ భరిత నాకౌట్‌ సమరం ప్రారంభంకానుంది. తొలి ప్రీక్వార్టర్స్‌లో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుండగా ఆ తర్వాత పోర్చుగల్‌, ఉరుగ్వే మధ్య మ్యాచ్‌ జరుగుతుంది.
 
ముఖ్యంగా, ఫ్రాన్స్‌తో జరిగే పోరులో అర్జెంటీనా జట్టు పూర్తిగా మెస్సీపైనే ఆధారపడివుంది. అతికష్టమ్మీద ఇక్కడి దాకా చేరిన అర్జెంటీనాకు ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 
 
గ్రూప్‌ దశలో ఐస్‌లాండ్‌తో డ్రా, క్రొయేషియాపై 0-3 తేడాతో ఓడిన సందర్భంలో మెస్సీ విఫలమయ్యాడు. దీంతో జట్టు ఆట కూడా గాడితప్పింది. కానీ గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో మెస్సీ ఓ సూపర్‌ గోల్‌తో మెరిశాడు. 
 
ఫలితంగా అర్జెంటీనా కూడా గట్టెక్కడంతో ఈ జట్టు మెస్సీపై ఎంతగా ఆధారపడి ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రాన్స్‌పైనా ఇదే స్థాయిలో చెలరేగితే జట్టుకు ప్రయోజనమే. అయితే జట్టు డిఫెన్సివ్‌ విభాగంలో లోపాలుండడం ఆందోళనకరం. తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్

2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?

సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కెరీర్‌ను మలుపుతిప్పంది : అనిల్ రావిపూడి

Sri Nandu: నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం : సైక్ సిద్ధార్థ.హీరో శ్రీ నందు

'మన శంకర వరప్రసాద్ గారు' బుకింగ్స్ ఓపెన్

Chiranjeevi: 100 మిలియన్ వ్యూస్ దాటి చార్ట్‌బస్టర్‌గా నిలిచిన మీసాల పిల్ల

Raviteja: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లపై వామ్మో వాయ్యో సాంగ్

తర్వాతి కథనం
Show comments