Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా వరల్డ్ కప్ 2018 : సెనెగల్‌కు చెక్ - కొలంబియా విన్నర్

ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీల్లో భాగంగా, కొలంబియా విజేతగా నిలిచింది. వరల్డ్ కప్ పోటీల్లో దిగిన ఆరుసార్లలో ఒకే ఒక్కసారి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న కొలంబియా.. ఈసారి ఆ చరిత్రను తిరుగరాసే దిశగా మరో అడుగు వ

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (11:18 IST)
ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీల్లో భాగంగా, కొలంబియా విజేతగా నిలిచింది. వరల్డ్ కప్ పోటీల్లో దిగిన ఆరుసార్లలో ఒకే ఒక్కసారి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న కొలంబియా.. ఈసారి ఆ చరిత్రను తిరుగరాసే దిశగా మరో అడుగు వేసింది. గెలిస్తే నాకౌట్.. ఓడితే వెనక్కి వచ్చే కఠిన పరిస్థితుల్లో తమలోని ప్రతిభను మరోసారి చూపెడుతూ కీలక మ్యాచ్‌లో సంచలనాల సెనెగల్‌కు చెక్ పెట్టింది.
 
బార్సిలోనా సూపర్‌స్టార్ యారీ మినా సూపర్ హెడర్‌తో నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేయగా మరోవైపు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడినా ఫేయిర్ ప్లే ఆధారంగా జపాన్ తుది 16 దశకు అర్హత సాధించింది. జపాన్‌తో సెనెగల్ సమానంగా 4 పాయింట్లు సాధించినా.. ఎక్కువ ఎల్లో కార్డులు ఉండటంతో పోలాండ్‌తో కలిసి ఇంటిముఖం పట్టింది. 
 
చివరి నిమిషాల్లో అత్యద్భుతంగా ఆడిన కొలంబియా జట్టు.. ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన గ్రూప్-హెచ్ చివరి లీగ్ మ్యాచ్‌లో కొలంబియా 1-0తో సెనెగల్‌పై నెగ్గింది. 74వ నిమిషంలో బార్సిలోనా మిడ్‌ఫీల్డర్ యారీ మినా బలమైన హెడర్‌తో కొలంబియాకు గోల్ సాధించి పెట్టాడు. మ్యాచ్‌కు ముందు నాలుగు జట్లకు సమాన అవకాశాలు ఉన్న ఈ గ్రూప్‌లో కొలంబియాతో కలిసి జపాన్ ముందుకెళ్లింది. 
 
కాగా, గ్రూప్ హెచ్‌లో కొలంబియా మొదటి స్థానంలో ఉండగా, జపాన్, సెనెగల్ నాలుగేసి పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో, మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో పోలాండ్ జట్టు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments