సాకర్ ప్రపంచకప్‌‌లో సంచలనం: జర్మనీ ఓడిపోయింది.. ఫ్యాన్స్ షాక్!

సాకర్ ప్రపంచకప్‌లో సంచలనం చోటుచేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ల జర్మనీ దక్షిణ కొరియా చేతిలో ఖంగుతింది. ఇంజూరీ టైంలో రెండు గోల్స్ చేసి జర

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (10:21 IST)
సాకర్ ప్రపంచకప్‌లో సంచలనం చోటుచేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ల జర్మనీ దక్షిణ కొరియా చేతిలో ఖంగుతింది. ఇంజూరీ టైంలో రెండు గోల్స్ చేసి జర్మనీ గుండెపగిలేలా చేసింది సౌత్ కొరియా. 92వ నిమిషంలో కిమ్ యాంగ్వాన్, 96వ నిమిషంలో సంన్ హ్యూంగ్ మిన్ గోల్స్ చేశారు. మెక్సికో చేతిలో ఓడి.. స్వీడన్‌పై గెలిచిన జర్మనీ.. ఈ మ్యాచ్‌ని కనీసం డ్రా చేసుకున్నా బాగుండేది. కానీ గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయింది. 
 
ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం సుమారు 28 షాట్స్ కొట్టినా జర్మనీ ప్లేయర్లు సక్సెస్ కాలేకపోయారు. సాకర్ చరిత్రలోనే డిఫెండింగ్ ఛాంపియన్ నాకౌట్ చేరకుండానే నిష్క్రమించడం ఇది నాలుగోసారి. 2002లో ఫ్రాన్స్, 2010లో ఇటలీ, 2014లో స్పెయిన్ ఇలాగే గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. 
 
సాకర్ ప్రపంచకప్‌లో జర్మనీది ఘనచరిత్ర. 1990 ఛాంపియన్ అయ్యాక  ప్రతీ టోర్నీలోనూ లీగ్ స్టేజ్ దాటింది. 2002 నుంచి జరిగిన ఐదు మెగా టోర్నీల్లో సెమీస్ దాకా వెళ్లింది. 2014లో అర్జెంటీనాను ఓడించి నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించిన జర్మనీ.. ఈసారి నాకౌట్ చేరకుండానే ఇంటిముఖం పట్టడం సాకర్ అభిమానులకు మింగుడుపడటం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments