Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిఫా వరల్డ్ కప్‌- భారత్ సరికొత్త రికార్డ్.. ఓ బుడతడు ఆ పనిచేశాడు..

ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం బెల్జియం-పనామా మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు రిషి తేజ్‌ అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువచ్చాడు. ఈ రిషితేజ్ ఎవరంటే మనదేశ బాలుడు. ఫిఫా ప్రపంచకప్

Advertiesment
ఫిఫా వరల్డ్ కప్‌- భారత్ సరికొత్త రికార్డ్.. ఓ బుడతడు ఆ పనిచేశాడు..
, మంగళవారం, 19 జూన్ 2018 (11:35 IST)
ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం బెల్జియం-పనామా మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు రిషి తేజ్‌ అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువచ్చాడు. ఈ రిషితేజ్ ఎవరంటే మనదేశ బాలుడు. ఫిఫా ప్రపంచకప్‌లో ఇలా అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువెళ్లిన తొలి భారతీయుడిగా రిషి చరిత్ర సృష్టించాడు. 
 
రష్యాలో జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్‌లో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం ఇలా అందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. టోర్నీలో భాగంగా మ్యాచ్‌ ప్రారంభానికి ముందు అధికారిక బంతిని పాఠశాల విద్యార్థులు మైదానంలోకి తీసుకువస్తారు. 
 
ఇందుకోసం ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 64 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేశారు. ఇందులో భారత్‌కు చెందిన రిషి తేజ్‌, నతనియా జాన్‌ ఉన్నారు. కర్ణాటకకు చెందిన రిషి తేజ్‌కు పదేళ్లు. ఇక రెండో విద్యార్థి నతనియా జాన్‌ తమిళనాడుకు చెందినవాడు. ఈ నెల 22న బ్రెజిల్‌-కోస్టారికా మధ్య జరిగే మ్యాచ్‌కు జాన్‌ బంతిని అందివ్వనున్నాడు.
 
ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ.. తనపై రికార్డు నమోదు కావడంపై హర్షం వ్యక్తం చేశాడు. మైదానంలోకి అధికారిక బంతిని తీసుకెళ్లిన విషయం గురించే ఆలోచించానే తప్ప.. మ్యాచ్‌ చూస్తూ ఎంజాయ్‌ చేయలేదన్నాడు. ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న దానిపై దృష్టి పెట్టా. ఇలాంటి అరుదైన అవకాశం దక్కినందుకు సంతోషంగా వుందన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిఫా వరల్డ్ కప్‌- జర్మనీకి షాక్.. సెర్బియా శుభారంభం