Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబు, దగ్గును నయం చేసే చికెన్ రసం ఎలా చేయాలి?

ముందుగా మిక్సీలో ఉల్లి తరుగు, జీలకర్ర, మిరియాలు, జీలకర్ర, పసుపు పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను రుబ్బుకోవాలి. కుక్కర్లో రెండు స్పూన్ల నూనె పోసి కరివేపాకు.. రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాలి. ఆప

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (16:18 IST)
వర్షాకాలంలో చీటికి మాటికి జలుబు, దగ్గు వేధిస్తుందా? అయితే ప్రోటీన్లతో కూడిన చికెన్ రసాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తినండి అంటున్నారు వైద్యులు. చికెన్‌ బరువును నియంత్రిస్తుంది. ఇందులోని ప్రోటీన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి చికెన్‌తో బిర్యానీలు, ఫ్రైలు కాకుండా వెరైటీగా రసం ట్రై చేద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
చికెన్ - 250 గ్రాములు
ఉల్లిపాయ తరుగు - అర కప్పు 
వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్ 
అల్లం పేస్ట్- ఒక స్పూన్  
మిరియాల పొడి- ఒక టీ స్పూన్ 
జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్ 
కొత్తిమీర పొడి - ఒక టీ స్పూన్
మిరప పొడి - అర టీ స్పూన్ 
పసుపు పొడి - ఒక టీ స్పూన్ 
టమోటా తరుగు - అర కప్పు 
ఉప్పు, నూనె - తగినంత 
కొత్తిమీర, కరివేపాకు తరుగు- పావు కప్పు
 
తయారీ విధానం : 
ముందుగా మిక్సీలో ఉల్లి తరుగు, జీలకర్ర, మిరియాలు, జీలకర్ర, పసుపు పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను రుబ్బుకోవాలి. కుక్కర్లో రెండు స్పూన్ల నూనె పోసి కరివేపాకు.. రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాలి. ఆపై టమోటా తరుగు, శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు చేర్చి.. తగినంత నీరు, ఉప్పును చేర్చుకోవాలి. ఆపై కుక్కర్‌ను మూతపెట్టి చికెన్‌ను ఉడికించాలి. ఉడికాక దించేసి... కొత్తిమీర తరుగును చల్లి వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే జలుబు, దగ్గు మాయమవుతుంది. అంతే చికెన్ రసం రెడీ..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

తర్వాతి కథనం
Show comments