నల్లటి వలయాలు, మచ్చలు పోవాలంటే.. మిరియాల పొడిని?
జిడ్డు చర్మం, ముఖంపై నల్లటి వలయాలను తొలగించుకోవాలంటే.. ముఖానికి కోడిగుడ్డు తెల్లసొనను వాడండి. చర్మంపై నల్లటి వలయాలు, మచ్చలు ఏర్పడటానికి ముఖ్య కారణమైన, చర్మరంధ్రాలను, కోడిగుడ్డులోని తెల్లసొన సమర్థవంతంగ
జిడ్డు చర్మం, ముఖంపై నల్లటి వలయాలను తొలగించుకోవాలంటే.. ముఖానికి కోడిగుడ్డు తెల్లసొనను వాడండి. చర్మంపై నల్లటి వలయాలు, మచ్చలు ఏర్పడటానికి ముఖ్య కారణమైన, చర్మరంధ్రాలను, కోడిగుడ్డులోని తెల్లసొన సమర్థవంతంగా తగ్గించి, ప్రకాశవంతమైన చర్మాన్నిస్తుంది. అలాగే చర్మ సౌందర్యం కోసం నిమ్మరసం, ఆపిల్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ వంటివి తీసుకోవాలి.
తాజా పండ్ల రసాలను తాగడంతో పాటు, చర్మంపై అప్లై చేసి, 15 నుంచి 20 నిమిషాల వరకూ వుంచి.. ఆపై శుభ్రమైన నీటితో కడిగేస్తే.. చర్మం మెరిసిపోతుంది. ఇంకా నల్లటి వలయాలను, మచ్చలను తొలగించుకోవాలంటే.. మిరియాలను ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే.. పెరుగులో నల్ల మిరియాల పొడిని కలిపి, ఈ మిశ్రమాన్నిముఖంపై అప్లై చేసి, కనీసం పది నుంచి 15 నిమిషాల పాటు వుంచి ఆపై నీటితో శుభ్రం చేసుకుంటే ఫలితం వుంటుంది.