Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరల్డ్ ఎగ్ డే: ఆరోగ్య ప్రదాత... రుచికరం..

"సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే" అనేది నేషనల్ ఎగ్- కో ఆర్డినేషన్ నినాదం. ఈ నినాదం ప్రభావం ఏమో కానీ… దేశంలో రోజు రోజుకీ గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గు

Advertiesment
World Egg Day
, శుక్రవారం, 13 అక్టోబరు 2017 (09:53 IST)
"సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే" అనేది నేషనల్ ఎగ్- కో ఆర్డినేషన్ నినాదం. ఈ నినాదం ప్రభావం ఏమో కానీ… దేశంలో రోజు రోజుకీ గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గుడ్డు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే తేడా లేకుండా ఎగ్గేరియన్స్ పెరిగిపోతున్నారు. 
 
ప్రస్తుతం నానాటికీ కాయకూరల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏది కొనాలన్నా జేబుకు చిల్లు పడుతోంది. ఈ పరిస్థితుల్లో అతి తక్కువ ధరకు ఎక్కువ పోషకాలుండే మంచి ఆహార పదార్థంగా గుడ్డు పేరుగడించింది. దీంతో రోజూ కోట్లకి కోట్ల గుడ్లు సేలవుతున్నాయి. అందుకే గుడ్డుకి భారీ డిమాండ్ పెరిగింది. రోజూ ఓ గుడ్డు తింటే హాస్పిటల్‌కి వెళ్లాల్సిన పనిలేదని పెద్దలతో పాటు వైద్యులు చెబుతుంటారు. 
 
గతంలో సఘటున ఒక వ్యక్తి సంవత్సరానికి 40 నుంచి 50 గుడ్లు లాగిస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. రెస్టారెంట్ల నుంచి… బజ్జీ బండ్ల వరకు.. బేకరీల్లో కూడా ఎగ్టేస్ట్ దొరుకుతుంది. కేకుల్లో కూడా ఎగ్స్ వెరీ వెరీ స్పెషల్. దేశంలో ఎగ్గుని తినేవారిలో తమిళనాడు వారు ముందుండగా… కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్లేసులో ఉంది. మన రాష్ట్రం నాలుగో ప్లేసులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎగ్స్‌ను తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చెపుతోంది.
 
ఇక గుడ్డు మీద జరుగుతున్న పరిశోధనలు కూడా ప్రతీ ఏటా కొత్త ఫలితాలను ఇస్తున్నాయి. గుడ్డును తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కి చెబుతున్నాయి. ప్రతీ రోజు ఓ గుడ్డును తీసుకోవడం వల్ల బాడీ ఎదుగుదలకు, కంటిచూపు మంచిగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎగ్స్‌ను తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయనడం కేవలం అపోహ మాత్రమే అనేది వైద్యుల మాట. ఎగ్గుతింటే ఎనర్జిటిక్‌గా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీరు తాగిన వెంటనే ఇవి చేస్తే ఇక వాళ్ల పని అంతేసంగతులు...