Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌ టీ20కి వరుణుడి ముప్పు... భారీ బందోబస్తు

భారత్ ‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం చివరి ట్వంటీ20 జరుగనుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో చివరి టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertiesment
India vs Australia 2017
, శుక్రవారం, 13 అక్టోబరు 2017 (06:29 IST)
భారత్ ‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం చివరి ట్వంటీ20 జరుగనుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో చివరి టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుస సిరీస్‌ విజయాలతో దూసుకెళ్తొన్న కోహ్లీ సేన ఈ సిరీస్‌ను చేజెక్కించుకుంటుందా లేదా ట్రోఫీతోనే స్వదేశానికి వెళ్తామన్న ఆసీస్‌ ఆటగాళ్లు తమ మాటను నిలబెట్టుకుంటారో తెలియాలంటే మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 
 
ఇదిలావుండగా, హైదరాబాద్‌లో జరగబోయే మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారనుంది. గతవారం భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తాజాగా రెండు రోజుల నుంచి నగరంలో పలు చోట్ల వర్షం పడుతూనే ఉంది. గురువారం కూడా వర్షం రావడంతో ఉప్పల్‌ మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గగానే సిబ్బంది కవర్లు తొలగించారు. 
 
తేమ ఎక్కువగా ప్రదేశాల్లో సిబ్బంది టేబుల్‌ ఫ్యాన్లతో పిచ్‌ను ఆరబెడుతున్నారు. దీంతో రేపు జరిగే టీ20కి వరుణుడి ముప్పు ఉండొచ్చనే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాంచీలో జరిగిన తొలి టీ20కి వర్షం ఆటంకం కల్పించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌కు 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. మరీ హైదరాబాద్‌ జరిగే నిర్ణయాత్మక టీ20లో ఏం జరుగుతుందో చూడాలి. 
 
ఇదిలావుండగా, ఉప్పల్‌ స్టేడియంలో జరిగే టీ20 ఫైనల్‌ మ్యాచ్‌ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహెశ్‌ భగవత్‌ తెలిపారు. 56 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్‌ సందర్బంగా ప్రేక్షకులు ఎలాంటి నిషేధిత వస్తువులు స్డేడియంలోకి తీసుకు రాకూడదని తెలిపారు. టికెట్లు కొనుగోలు చేసిన వారిని అనుమతి ఇస్తామని ఆయన అన్నారు. సెల్‌ఫోన్లకు అనుమతి ఉన్నా, పవర్‌ బ్యాంకులు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు తీసుకురాకూడదన్నారు. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసీస్ ఆటగాళ్ల బస్సుపై దాడి.. ''సారీ ఆస్ట్రేలియా'' క్షమాపణలు కోరిన గౌహతి యువత