ఒక గ్లాసుడు మజ్జిగలో నిమ్మరసాన్ని పిండుకుని తాగితే?
శరీరంలోని రక్తం శుద్ధికాని పక్షంలో అలసట, జ్వరం, ఉదర సంబంధిత రుగ్మతలు, శ్వాసకోశ వ్యాధులు ఏర్పడుతాయి. అందుకే రక్తశుద్ధికి తగిన ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. బీట్ రూట్‌ను తీసుకోవడం
శరీరంలోని రక్తం శుద్ధికాని పక్షంలో అలసట, జ్వరం, ఉదర సంబంధిత రుగ్మతలు, శ్వాసకోశ వ్యాధులు ఏర్పడుతాయి. అందుకే రక్తశుద్ధికి తగిన ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
బీట్ రూట్‌ను తీసుకోవడం ద్వారా రక్తం శుద్ధి అవుతుంది. మందార రేకులను పరగడుపున తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. మునగాకును కందిపప్పుతో వండి.. ఓ కోడిగుడ్డు ఆ కూరలో పోసి నేతితో కలిసి 41 రోజుల పాటు తీసుకుంటే రక్తంలోని మలినాలు తొలగిపోతాయి.
అలాగే నేరేడు పండ్లను రోజూ తీసుకోవడం ద్వారా రక్తం శుద్ధి అవుతుంది. అల్లం రసంతో తేనెను కలిపి తీసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది. టమోటా పండ్లను రోజూ తీసుకుంటే పిత్త వాతం తగ్గిపోతుంది. రేగి పండ్లను కూడా రోజూ తీసుకుంటే అలసట తొలగిపోతుంది. రోజంతా చురుగ్గా వుంచుతుంది. ఆకలిని పెంచుతుంది.
అలాగే రక్త ప్రసరణ మెరుగ్గా వుంటే హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంకా రోజుకో కప్పు పెరుగును తీసుకోవడం ద్వారా గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇంకా మరిగించి ఆరబెట్టిన నీటిలో జీలకర్ర పొడి చేర్చి ఆరు గంటలపాటు ఊరనివ్వాలి. ఆ నీటిని సేవించడం ద్వారా రక్తపోటు క్రమంగా తగ్గుతుంది.
ఇంకా ఒక గ్లాసు మజ్జిగలో నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే.. రక్తపోటు నియంత్రణలో వుంటుంది. అవిసె ఆకును వారానికి రెండుసార్లు తీసుకుంటే హైబీపీని అదుపులో వుంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.