Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాష్ట్రం మేల్ సె**క్స్ వర్కర్లకు స్వర్గధామం!.. అడ్డాగా మారిన అమీర్‌పేట్?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (12:36 IST)
పైసా పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే మార్గం ఏదైనా ఉందంటే.. అది ఒక్క వ్యభిచార వృత్తి మాత్రమే. అందుకే జల్సాలకు అలవాటుపడిన, పూటగడవని సెలెబ్రిటీలు మొదలుకుని అనేక మంది అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు, మహిళలు పడుపు వృత్తిని ఎంచుకుంటారు. అయితే, ఈ వృత్తిలో ఎక్కువగా అమ్మాయిలు లేదా మహిళలు ఉంటారు. కానీ, ఇపుడు కొత్త ట్రెండ్ మొదలైంది. మేల్ సెక్స్ వర్కర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సంస్కృతి విదేశాల్లో ఉందిలే అనుకుంటే పొరబడినట్టే. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో ఈ మేల్ సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడకు వెస్ట్ బెంగాల్, ఒడిషా, బిహార్ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో మేల్ సెక్స్ వర్కర్లు వచ్చి అటు ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఇటు డబ్బు కూడా అర్జిస్తున్నారు. 
 
ఇప్పటివరకు ప్రాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇపుడు మన దేశంలోకి ప్రవేశించింది. ఈ మాటలు వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా.. ఇది నమ్మాల్సిన నిజం. మన దేశంలో మేల్ సెక్స్ వర్కర్ల వృత్తి క్రమంగా పెరిగిపోతోంది. డబ్బు సంపాదన కోసం ఈ దారిని ఎంచుకుంటున్నట్లు యువత చెబుతుండడం గమనార్హం. మేల్ సెక్స్ వర్కర్ల విస్తరణపై ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కేరళ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సర్వే ప్రకారం.. కేరళలో 17,000 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 13,331 మంది మేల్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. అయితే వీరంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారే కాదని తెలింది. ఇక్కడికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సెక్స్ వర్కర్లు కూడా వేలల్లో ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. దీని వల్ల కూడా రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు సర్వేలో స్పష్టం అయింది. 
 
మగ సెక్స్ వర్కర్లు మాత్రం కేరళలో కోజికోడ్ జిల్లా నుంచి ఎక్కువగా వస్తున్నారు. వీరంతా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన వారుగా తెలిసింది. నగరాలకు వలస వచ్చిన యువత.. హోటళ్లు, ఫ్లాట్లల్లో అద్దెకు ఉంటూ ఈ అసాంఘిక కార్యకలాపాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. మగ సెక్స్ వర్కర్లుగా 36 నుంచి 46 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.
 
ప్రకృతికి నిలయమైన కేరళ.. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం. ఇక్కడికి ఏటా లక్షలాది మంది టూరిస్టులు వస్తుంటారు. వారితో పాటే ఈ రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లు కూడా దిగుమతి అవుతున్నారు. ముఖ్యంగా బెంగాల్, బీహార్, ఒడిశా నుంచి మహిళా సెక్స్ వర్కర్లు ఎక్కువగా వలస వస్తున్నట్లు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గుర్తించింది. 
 
బెంగాల్ ఏజెంట్ల ద్వారా ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు కేరళకు వస్తున్నారని సర్వే ద్వారా బహిర్గతమైంది. ఇక పురుషుల్లో బీహార్ నుంచి వస్తున్న వారే ఈ వృత్తిలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని తేటతెల్లం అయింది. ఈ వృత్తిలోకి వస్తున్న వారంతా క్రమంగా వారి బంధుమిత్రులను కూడా ఇదే వృత్తిలోకి తీసుకొస్తుండడం ఆందోళన కలిగించే అంశం.
 
ఒక్క కేరళ రాష్ట్రమే కాదు.. హైదరాబాద్‌లోనూ మేల్ సెక్స్ వర్కర్లు విపరీతంగా పెరిగిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్లను ఏర్పాటు చేసి ఈ చీకటి దందాను నడిపిస్తున్నట్లు గుర్తించారు. గతంలో అమీర్‌పేట కేంద్రంగా నడుస్తున్న ఓ మేల్ సెక్స్ వర్కర్ల నెట్ వర్క్‌ను పోలీసులు ఛేదించారు. యువతకు ఆకర్షించేలా ‘సుఖంతోపాటు వేలల్లో వేతనాలంటూ’ ప్రకటనలిస్తూ.. మేల్ సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారు. 
 
ఆ తర్వాత ఎంట్రీ, డిపాజిట్ ఫీజుల పేరుతో లక్షల రూపాయలు దండుకున్న సంఘటనలు పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్నాయి. మరికొంత మందిని మేల్ సెక్స్ వర్కర్లుగా మార్చి.. కమీషన్లు దండుకుంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రాల్లో మగ వ్యభిచారులు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం