Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఐదువేల మందికి దర్శనం..

Advertiesment
శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఐదువేల మందికి దర్శనం..
, శనివారం, 19 డిశెంబరు 2020 (19:04 IST)
కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా ఈ ఏడాది భక్తులు లేక బోసిపోయింది. నవంబర్ 16 వ తేదీ నుంచి సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు. వారాంతంలో రెండవ వేలమందికి, వారం మధ్య రోజుల్లో వెయ్యి మందిని అనుమతించారు. ఆ తరువాత ఆ సంఖ్యను పెంచి మామూలు రోజుల్లో రెండు వేలమందికి, వారాంతాల్లో మూడు వేల మందికి అనుమతి ఇచ్చారు. 
 
కాగా, ఈ సంఖ్యను పెంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రోజుకు 5 వేలమంది భక్తులకు దర్శనం అవకాశం ఇవ్వాలని ట్రావెన్ కొర్ ట్రస్ట్‌ను ఆదేశించింది. డిసెంబర్ 26 వ తేదీన మండలం పూజను నిర్వహిస్తారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. 
 
మండలం పూజ తరువాత జనవరి 14 న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఆ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, మండలం పూజ తరువాత యాత్రికులతో పాటుగా, సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదో తరగతి విద్యార్థులు 13మందికి కరోనా.. ఏపీలో కోవిడ్ అప్డేట్