Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షింగెల్లా బ్యాక్టీరియా.. కేరళలో కలకలం.. బాలుడు మృతి

షింగెల్లా బ్యాక్టీరియా.. కేరళలో కలకలం.. బాలుడు మృతి
, సోమవారం, 21 డిశెంబరు 2020 (12:03 IST)
కరోనా వైరస్‌తో ఇప్పటికే ఇబ్బందులు తప్పట్లేదు. తాజాగా కేరళకి ఇప్పుడు షింగెల్లా బ్యాక్టీరియా అనే మరోదెబ్బ తగిలింది. రోజుకు కొన్ని వేల కేసుల్లో కరోనా కేసులు వస్తున్న వాటి పక్కనే ఈ బ్యాక్టీరియాతో బాధపడే వారి పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది. 2020 సంవత్సరం పూర్తికావస్తోంది. 2021 ఇక మనదే అని ప్రతిఒక్కరు అనుకున్న అంతలోనే కొత్త వైరస్ అంటూ ఒక వార్త బయటికి వచ్చింది.
 
ఇక మన దేశంలో కొత్త బ్యాక్టీరియా అంటూ వార్తల్లోకి ఎక్కింది. ఇవన్నీ గమనిస్తే 2021 కూడా మనకు నిరాశే మిగిలిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్‌తో పోలిస్తే బ్యాక్టీరియా కొన్ని పరిస్థితులలో మధ్య దాని ప్రభావం తగ్గిపోతుంది. 
 
కేరళలో షింగెల్లా అనే బ్యాక్టీరియా మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే మొత్తంగా 52 మందికి ఈ బ్యాక్టీరియా సోకింది. ఈ మధ్యనే ఈ షింగెల్లా బ్యాక్టీరియాతో ఓ పిల్లాడు మరణించడం తీవ్రంగా కలిచివేసింది. ఆ తర్వాత చాలా మందిలో ఈ బ్యాక్టీరియా లక్షణాలు కనిపించగా. తాజాగా మరో ఆరుగురికి ఇది సోకినట్లు తేలింది. ఈ బ్యాక్టీరియా కూడా కరోనా వైరస్ లాగా మరణించిన రోగి యొక్క శరీరంలోను ఉంటుంది. అటు నుండి వేరే వారి శరీరం లోకి ప్రవేశిస్తుంది. ఇది కూడా కరోనా కంటే ప్రమాదకరమైనది అంటూ వైద్యులు చెబుతున్నారు. 
 
ఈ వ్యాధిపై కేరళ ఆరోగ్య శాఖ దర్యాప్తు చేయగా...షింగెల్లా బ్యాక్టీరియా కలుషిత నీటి ద్వారా ఇది వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బాలుడు అంత్యక్రియలకు వాడిన నీటి వల్లే తాజాగా ఆరుగురికి ఈ వ్యాధి సోకిందని డాక్టర్లు చెబుతున్నారు . అసలు మరణించిన బాలుడి నివాస ప్రాంతంలోకి ఈ బ్యాక్టీరియా ఎలా వచ్చిందో మాత్రం తెలియడంలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
షిగెల్లా బ్యాక్టీరియా సోకినా తర్వాత వారికీ జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, రక్త విరోచనాలు వంటి లక్షణాలుంటాయని చెప్పారు. మొదటి రెండు రోజులు పెద్ద లక్షణాలు బయటపడక పోయిన ఒక వారం రోజుల తర్వాత తీవ్ర లక్షణాలుంటాయని వెల్లడించారు. ముఖ్యంగా చిన్నారులే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది .. కలుషిత నీటిని మరియు ఆహారం తీసుకోవడం వాళ్ళ ఈ వ్యాధి బారిన పడే ప్రమాదముందని డాక్టర్లు అంటున్నారు. అయితే ఈ వ్యాధి బారిన పడతుందా ఉండాలంటే ఎల్లపుడు పరిశుభ్రంగా ఉండాలని మరియు భోజనం పట్ల జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు అంటున్నారు .. ఆలా చేస్తే షింగెల్లాే బ్యాక్టీరియా సోకకుండ బయటపడవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ చేసి అతిపెద్ద తప్పు అదే.. లేకుంటేనా... ఉండవల్లి అరుణ్ కుమార్