మరో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (12:34 IST)
తెలంగాణలో మరో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఎమ్మెల్యే తెలిపారు.

గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కోవిడ్‌ పరీక్ష చేయించుకుని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

కరోనా చికిత్స చేయించుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్‌ చేయొద్దని, అలాగే కలవటానికి కూడా ప్రయత్నించవద్దని ప్రజలకు ప్రకాష్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రెండో విడత కాస్తా తగ్గినప్పటికీ అనిపించినా మళ్లీ కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. దీంతో ప్రజలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments