Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త కరోనా వ్యాప్తి 70శాతం వేగం

Advertiesment
కొత్త కరోనా వ్యాప్తి 70శాతం వేగం
, బుధవారం, 23 డిశెంబరు 2020 (12:01 IST)
ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్ల పతనం.. ఐరోపాకు వెళ్లే విమాన సర్వీసులపై ఆంక్షలు.. టీకా పనిచేయదేమోనన్న ఆందోళనలు.. కరోనా కొత్త రూపం ప్రకంపనలు ఇవీ..!

కరోనా వ్యాధికి కారణమైన సార్స్‌కోవ్‌-2 వైరస్‌లో చోటు చేసుకొన్న ఒక చిన్న మార్పు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. సోమవారం భారతీయ స్టాక్‌ మార్కెట్లలో రూ.ఆరున్నర లక్షల కోట్ల సంపద ఆవిరైందంటే ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త వైరస్‌ రకానికి సంబంధించి  పూర్తి సమాచారం ఇంకా వెలుగురాలేదు. 
 
కొత్త మ్యూటేషన్‌ ఏమిటీ..?
వైరస్‌లు.. జంతువులు, మనుషులకు సోకినప్పుడు విపరీతంగా పునరుత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో కొత్తగా పుట్టుకొచ్చే వైరస్‌ల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకొంటాయి. వీటినే మ్యూటేషన్లు అంటారు. మార్పునకు గురైన వైరస్‌ కొత్తరూపాన్ని స్ట్రెయిన్‌ అంటారు. కరోనా వైరస్‌ కూడా చాలా సార్లు మార్పు చెందింది. గతంలో d614g  రకం కూడా శాస్త్రవేత్తలను భయపెట్టింది.

తాజాగా గుర్తించిన కరోనావైరస్‌ మార్పును the VUI-202012/01 రకంగా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. VUI అంటే ‘వైరస్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌’ అని. దీనిపై యూకేకు చెందిన న్యూ అండ్‌ ఎమర్జింగ్‌ రెస్పరేటరీ వైరస్‌ థ్రెట్స్‌ అడ్వెర్సరీ గ్రూప్‌(ఎన్‌ఈఆర్‌వీటీఏజీ) సోమవారం కీలకమైన వివరాలను వెల్లడించింది. వేగంగా వ్యాప్తి చెందడానికి అవసరమైన లక్షణాలు ఈ వైరస్‌లో ఉన్నాయని పేర్కొంది.  
 
ప్రస్తుతానికి ఈ మార్పులు వైరస్‌ జన్యుక్రమంలో ఒక శాతంలో పదోవంతు కంటే తక్కువే. ఇవి వేగంగా జరిగితే త్వరలోనే ఈ వైరస్‌ కొత్త జాతిగా మారొచ్చు. ఇక్కడ ఒక సానుకూల అంశం ఏమిటంటే.. మిగిలిన వైరస్‌లతో పోలిస్తే ఇది తక్కువ మార్పులకు లోనవుతోంది. సార్స్‌ కోవ్‌2 వైరస్‌లోని జన్యుక్రమాల్లో చోటుచేసుకొనే మార్పులను కొన్ని ప్రొటీన్లు సరిచేస్తునట్లు గుర్తించారు. అదే హెచ్‌ఐవీ వైరస్ అయితే మనిషిలోకి ప్రవేశించాకే భారీగా మార్పులకు లోనవుతుంది. అందుకే  హెచ్‌ఐవీకి టీకా చేయడం దాదాపు అసాధ్యంగా మారింది.   
 
క్రిస్మస్‌ సమయంలో ఆంక్షలు దేనికి..?
సార్స్‌కోవ్‌-2 వైరస్‌ మనుషులను సోకడానికి వీలుగా ‘స్పైక్‌ ప్రొటీన్‌’లో మార్పులు చోటు చేసుకొని మరింత సమర్థంగా తయారైనట్లు అంచనా వేస్తున్నారు. దీంతో వ్యాధి వ్యాప్తి వేగవంతం కానుంది. కొత్త వైరస్‌ కారణంగా ఆర్‌నాట్‌ విలువ(వ్యాధి వ్యాప్తిని కొలిచే విధానం)లో కూడా 0.39-0.93శాతం వృద్ధి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

పాత రకం వైరస్‌ కంటే కనీసం 70శాతం అధికంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  ఇలాంటి వైరస్‌లు సూపర్‌ స్ప్రెడ్‌ ఈవెంట్లను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్‌ సమయంలో షాపింగ్‌లకు జనాలు గుమిగూడతారు. అప్పుడు వ్యాప్తి సాధారణంగా కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్రిటన్‌లో ఆంక్షలను కఠిన తరం చేశారు.
 
కొత్త వైరస్‌ను ఎక్కడెక్కడ గుర్తించారు..?
యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ లెక్కల ప్రకారం ఈ రకం వైరస్‌ డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, బెల్జియం, ఇటలీల్లో కూడా కనుగొన్నారు. ఇప్పటికే ఈ రకం వైరస్‌కు సంబంధించిన కేసులు ఇంగ్లాండ్‌లో భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ సహా పలు దేశాలు ఇంగ్లాండ్ వెళ్లే విమానాలపై నిషేధం విధించాయి.  
 
ఇది ప్రాణాంతకమైందా..?
వైరస్‌ వేగంగా వ్యాపించడం వేరు..  ప్రాణాంతకంగా మారడం వేరు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నట్లు మాత్రమే గుర్తించారు. ఎన్‌ఈఆర్‌వీటీఏజీ శాస్త్రవేత్తలకు  కొత్త సార్స్‌కోవ్‌2 డేటా తక్కువగానే లభించింది. 1000 కేసుల్లో నాలుగు మరణాలను మాత్రమే గుర్తించినట్లు వీరు పేర్కొన్నారు.

అంతిమంగా ఒక నిర్ణయానికి రావడానికి ఈ డేటా ఏమాత్రం సరిపోదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధన పూర్తిఅయ్యాకే ఈ కొత్త రకం ఏ వయసు వారిపై ఎలా ప్రభావం చూపుతుందన్న అంశాలు వెలుగులోకి వస్తాయి కొత్త రకం వైరస్‌ వెలుగు చూసిన తరుణంలో ఆందోళన

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాదక ద్రవ్యాల వినియోగం వలన నష్టాలే: కృష్ణాజిల్లా కలెక్టర్