Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

మాదక ద్రవ్యాల వినియోగం వలన నష్టాలే: కృష్ణాజిల్లా కలెక్టర్

Advertiesment
drug
, బుధవారం, 23 డిశెంబరు 2020 (11:58 IST)
మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా పలువురి జీవితాలు తెగిన గాలిపటాల మాదిరిగా మారుతున్నాయని, మత్తు పదార్ధాల  కారణంగా  లభించే సౌఖ్యం క్షణికమే కాగా ఆర్థికంగానే కాకుండా ఆరోగ్య పరంగాను, సామాజిక పరంగాను ఒనగూరే నష్టాలే అధికంగా ఉంటాయని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ పేర్కొన్నారు. 

కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో పోలీసులు మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు  ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు యాంటీ డ్రగ్ కార్యక్రమాలపై దృష్టి  సారించారు.  మత్తు పదార్ధాలు సేవించడం ద్వారా కలిగే అనర్ధాలపై ప్రజలకు వివరిస్తున్నారు.

పట్టణంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో దీనిపై ప్రచార కార్యక్రమాన్ని కొద్దిరోజులుగా నిర్వహిస్తున్నారు. కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మహిళా పోలీసులు ప్రజలతో సమావేశమయ్యి మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్నారు. 

స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నున్న పోలీస్ పెట్రోల్ బంకు నుంచి జిల్లా కోర్టు కూడలి వరకు స్థానిక పోలీసులు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులచే  ఒక భారీ యాంటీ డ్రగ్  ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల చివరిరోజును పురస్కరించుకుని స్థానిక  కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు  ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం జిల్లా కోర్టు సెంటర్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, దేశంలో 273 జిల్లాలలో మాధకద్రవ్యాల వినియోగం అధికంగా ఉందని మన ఆంధ్రప్రదేశ్ లో  4 జిల్లాలు ఉంటే అందులో మన కృష్ణాజిల్లా  బాధాకరమని అన్నారు.  నషా ముఖ్త్ భారత్ లో భాగంగా  కృష్ణాజిల్లాను సైతం మాదకద్రవ్యాల వినియోగం లేని జిల్లాగా రూపొందించేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపు ఇచ్చారు. 

మత్తు పదార్థాలకు యువతీ యువకులు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలు సేవిస్తే జీవితాలు నాశనమవు తాయని చెప్పారు.  వ్యక్తి తన కుటుంబం కోసం కొంత సాయాన్ని కేటాయిస్తే ఎన్నో అనర్ధాలు నివారించవచ్చని కలెక్టర్ సూచించారు.   

ఈ కార్యక్రమంలో  కృష్ణాజిల్లా ఎస్పీ  రవీంద్రనాధ్ బాబు,  పలు కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, పలువురు పోలీస్ అధికారులు, మహిళా సంరక్షణా కార్యకర్తలు, ఆటో యూనియన్‌ ప్రతినిధులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీలు