ఆంధ్రప్రదేస్ సర్కార్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కొత్తరకం కరోనా వ్యాప్తి చెందిందంటూ దేవినేని ట్వీట్ చేశారు. కేవలం ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకుంటుందని, కేసులు పెడుతుందని విమర్శించారు.
స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోందన్నారు. వైసీపీ సభలు, పాదయాత్రలు, పుట్టినరోజు వేడుకలకి మాత్రం అడ్డంకి కాదని ఉమ అన్నారు. ‘‘వారికి ఈ వైరస్ సోకదనేనా? ఈ నెల 25న మీ రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి పంపిణి చేస్తానన్న వాక్సిన్ దీనికేనా?’’ జగన్ అంటూ దేవినేని ప్రశ్నల వర్షం కురిపించారు.