Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అదేంటో తెలుసా?

Advertiesment
Andhra Pradesh government
, సోమవారం, 14 డిశెంబరు 2020 (08:36 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చరిత్రలో మొదటిసారిగా చర్చి నిర్మించేందుకు టెండర్లు పిలిచింది. గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండల కేంద్రంలో నూతన చర్చ నిర్మించేందుకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది.

'బేతల్ క్రిస్టియన్ బ్రథర్న్ ట్రస్ట్ చర్చ్' పేరుతో నిర్మిస్తున్న చర్చ్ కోసం 8లక్షల 72వేల 663 రూపాయలు కేటాయించింది. ఈనెల 21లోగా క్లాస్-5 అంతకంటే పైస్థాయి కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయవచ్చని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు 6నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
 
సాధారణంగా ప్రభుత్వం కూడా ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించదు. రాష్ట్రంలో ఎలాంటి ఆలయాలుగానీ, చర్చిలుగానీ, మసీదులు గానీ నిర్మించదు. ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులిస్తుంది.

దేశంలో చర్చిలు, మసీదుల నిర్మాణానికి విదేశాల నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. వాటి ద్వారానో, దాతలు నుంచి విరాళాలు సేకరించి చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలు నిర్మిస్తుంటారు. కానీ ఆంధ్రాలో మాత్రం ప్రభుత్వమే చర్చి నిర్మాణానికి సిద్ధమైంది.
 
గతంలో జీవోలు
గతంలో కూడా ప్రభుత్వం రాష్ట్రంలో మూడు చర్చిల నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని ఆముదాలపల్లి గ్రామంలో కల్వరి చర్చి, ఆముదాలపల్లిలోని హరిజనవాడలో గ్లోరియస్ చర్చి, కాళీపట్నం గ్రామంలో బ్లెస్సీ చర్చి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.15లక్షల నిధులు మంజూరు చేసింది.

మరోవైపు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరులో నిస్సీ రిలీఫ్ సొసైటీ చర్చి నిర్మాణానికి మరో రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్టు గతేడాది డిసెంబర్ లో జీవో జారీ చేసింది. మైనార్టీ సంక్షేమంలో భాగంగానే చర్చిలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తూనే ఉంది. టీటీడీ బడ్జెట్లో అతితక్కువ భాగం ధర్మపరిరక్షణకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

రాష్ట్రంలో హిందూ ఆలయలను, దేవుళ్లను అవమానిస్తున్న చర్యలు తీసుకోవడం లేదని . అన్యమత కార్యక్రమాలకు అనుమతులిస్తున్న ప్రభుత్వం.. హిందువుల ఉత్సవాలను మాత్రం అడ్డుకుంటోందని గతంలో ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలకు, ప్రభుత్వానికి మేలు కొలుపుగా వార్తలుండాలి: మంత్రి బొత్స సత్యనారాయణ