Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటిలోనే స్వీయ గృహ నిర్భంధం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కొత్త గైడ్ లైన్లు

ఇంటిలోనే స్వీయ గృహ నిర్భంధం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కొత్త గైడ్ లైన్లు
, సోమవారం, 29 జూన్ 2020 (10:13 IST)
ప్రతిరోజూ కేసులు పెరుగుతున్నాయి, మరియు ఇంటిలోనే ఒంటరిగా నిర్భయంగా ఉండటానికి డిమాండ్ పెరుగుతుంది. ప్రతి జిల్లాలో ప్రత్యేకమైన 1000 పడకల సిసిసి - కోవిడ్ కేర్ సెంటర్లను ప్రభుత్వం కేటాయించింది (ఈ పడకలు 2-3 కేంద్రాలలో ఉండవచ్చు).

ఈ ఒక కేంద్రంను నోవెల్ సిసిసి (ట్రియేజ్ సెంటర్) గా నియమించబడింది. ఈ నోవెల్ సిసిసిలో ఇసిజి, ఎక్స్‌రే, లాబ్ టెస్ట్‌లు వంటి అన్ని డయాగ్నొస్టిక్ సదుపాయాలు లభిస్తాయి, ఎవరైనాకోవిడ్ పాజిటివ్ అయి ఉంటే, నోవెల్ సిసిసికి మార్చబడతారు మరియు అక్కడ  పరీక్షించబడతారు.

తేలికపాటి లక్షణాలు కలిగి సిసిసికి బదిలీ చేయబడకూడదని అతను అనుకొంటే, ఏవరయినా హోమ్ ఐసోలేషన్ (10-60 సంవత్సరాల మధ్య వయసు వారు) కావాలనుకుంటే, ఆ సిసిసి యొక్క ఇన్‌ఛార్జ్ స్వయంగా ఇంటి ఐసోలేషన్‌కు అనుమతి ఇస్తారు.

అయితే మధ్యమమైన, తీవ్రమైన లక్షణాలు మరియు డయాబెటిస్, రక్త పోటు, సిఓపిడి వంటి అనారోగ్యాలు ఉన్నవారు మాత్రం కోవిడ్ హాస్పిటల్స్ కు మార్చబడతారు.
 
ఇంటిలో ఉన్న ఐసోలేషన్  రోగులు పల్స్, బిపి, ఎస్పిఓ 2 '(ఆక్సిజన్ శాతం'), బ్లడ్ షుగర్ కోసం తమను తాము పరీక్షలు చేసుకొని  పర్యవేక్షించుకోవాలి. 

ఆ ప్రాంతానికి చెందిన కోవిడ్ సెంటర్ మరియు ఏఎన్ఎం ద్వారా అతనికి శిక్షణ ఇవ్వబడుతుంది మరియు ఆమె మీ ప్రాణాధారాలను ఎంఎస్ఎస్ అప్లికేషన్ ద్వారా పర్యవేక్షిస్తుంది.
 
ఇంటిలో ఉన్న ఐసోలేషన్  రోగులను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన టెలికన్‌సల్టేషన్ కేంద్రాలు పనిచేస్తాయి. వారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు మరియు న్యూట్రిషన్, సైకలాజికల్ సపోర్ట్ కోసం మార్గదర్శకత్వం కూడా ఇస్తారు.
 
 ఏదైనా ఇంటి ఐసోలేషన్ ఉన్న రోగికి కష్ఠం కలిగితే, అతన్ని మరింత మెరుగైన చికిత్స కోసం కోవిడ్ ఆసుపత్రులకు తరలిస్తారు. ఏఎన్ఎం కన్సల్టేషన్ బృందాలు రోగులను బదిలీ చేసే రాపిడ్ రెస్పాన్స్ బృందాలకు తెలియజేస్తారు.
 
ఇంటి ఐసోలేషన్ 28 రోజుల్లో పూర్తిచేసిన తరువాత - మీరు కోవిడ్ కోసం పరీక్షించబడతారు, దీని కోసం ఏఎన్ఎం మీకు సహాయం చేస్తుంది. మీ ఇంటి ఐసోలేషన్ పూర్తయినట్లు ప్రకటించిన తరువాత  మీరు స్వీయ గృహ నిర్భంధం నుండి విముక్తి పొందుతారు.
 
ప్రభుత్వం  కల్పించిన  స్వీయ గృహ నిర్భంధం సదుపాయాన్ని ఉపయోగించుకోండి మరియు మీరు కోవిడ్ పాజిటివ్ అయినప్పటికీ మీ ఇంటిలోనే సురక్షితంగా ఉండండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23వ రోజూ తగ్గని పెట్రోల్ ధరలు.. సామాన్యుడిపై భారం