Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశద‌ర్శ‌నం టిక్కెట్ల కోటా విడుద‌ల

Advertiesment
Special quote
తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం జులై నెల‌కు సంబంధించిన రూ.300 ప్ర‌త్యేక ‌ప్ర‌వేశద‌ర్శ‌న టిక్కెట్ల కోటాను సోమ‌వారం టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

రోజుకు 9 వేల టికెట్ల చొప్పున స్లాట్ల వారీగా అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా జులై 1వ తేదీ నుండి రోజుకు 3 వేలు చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేస్తారు.

తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంట‌ర్ల ద్వారా భ‌క్తులు ఒకరోజు ముందు ఈ టోకెన్లు పొంద‌వ‌చ్చు. జూలై 1న శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఈ నెల 30న తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తారు. 
 
జూలైలో శ్రీ‌వారి ఆల‌యంలో ప‌ర్వ‌దినాలు ఇవే...
* 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, జూలై 16న ఆణివ‌ర ఆస్థానం.
* 24న శ్రీ ఆండాళ్ తిరువాడిప్పూరం శాత్తుమొర‌, తిరుమ‌ల శ్రీ‌వారు పురిశైవారితోట‌కు వేంచేపు.
* 28న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి.
* 30 నుండి ఆగ‌స్టు 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నగరంలో మళ్లీ లాక్డౌన్ : పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్