Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు నాన్న.. వాట్సాప్ మెసేజ్.. ఆపై పురుగుల మందు తాగి?

సెల్వి
సోమవారం, 30 జూన్ 2025 (10:40 IST)
Dowry case
తమిళనాడులోని తిరుప్పూర్‌లో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివాహం చేసుకున్న మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకునేందుకు వరకట్నమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలడంతో వివాహిత భర్త, అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. రితన్య (27)కు, కవిన్ కుమార్ (28)తో పెళ్లి జరగగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడంతో పురుగుమందు తాగి రితన్య ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల క్రితం ఈ జంట వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వివాహం జరిగిన కొన్ని వారాల తర్వాత రితన్య తన భర్త, అతని తల్లిదండ్రులు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ తన ఆత్మహత్యకు కారణాలు చెబుతూ తన తండ్రికి వాట్సాప్‌లో వాయిస్ నోట్ పంపిన తర్వాత ఈ దారుణమైన చర్య తీసుకుంది. మధ్యాహ్నం సమయంలో మొండిపాళయం వద్ద కారులో ఆమె మృతి చెంది కనిపించిందని, మృతదేహాన్ని అవినాశిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
 
 ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేయూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments