Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

Advertiesment
jump

ఐవీఆర్

, గురువారం, 3 ఏప్రియల్ 2025 (19:10 IST)
ఆమె అతడిని గాఢంగా ప్రేమించింది. అనుక్షణం అతడి కోసమే తపించింది. తెల్లవారిందే తడవుగా అతడి దగ్గరకు వెళ్తూ వుండేది. ఒకరోజు అతడిని కౌగిలించుకునేందుకు ప్రయత్నించింది. ఆమెను కాస్త దూరంగా నెట్టేసిన ఆ యువకుడు తనకు అలాంటి ఫీలింగ్ లేదని అన్నాడు. కేవలం స్నేహితురాలిగా మాత్రమే చూస్తున్నట్లు చెప్పాడు. అంతే... 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. దక్షిణ ముంబైకి చెందిన ఓ వ్యాపారస్తుడు కుమార్తె నగరంలో ఓ కాలేజీలో చదువుతోంది. ఆమె వయసు 22 ఏళ్లు. తనతో గత కొన్నేళ్లుగా స్నేహంగా వుంటూ వస్తున్న బోయ్ ఫ్రెండుతో ప్రేమలో పడింది. ఈ క్రమంలో బుధవారం నాడు ఉదయం అతడితో మాట్లాడుతూ... మెల్లగా కౌగిలించుకోబోయింది. వెంటనే అతడు ఆమెను కాస్త దూరంగా నెట్టాడు. అలాంటివి చేయవద్దని మందలించాడు. తను కేవలం స్నేహితురాలిగా మాత్రమే చూస్తున్నట్లు చెప్పాడు. దాంతో ఆమె జీర్ణించుకోలేకపోయింది. తను ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు చెప్పింది. కానీ దానికి అతడు అంగీకరించలేదు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైంది.
 
14 అంతస్తుల కాలేజీ భవనం పైకి ఎక్కింది. ఇది గమనించిన ఇద్దరు స్నేహితులు వెంటనే ఆమె వద్దకు వెళ్లారు. తను ఎంతగానో ప్రేమిస్తున్న యువకుడు తనను కాదన్నాడనీ, ఇక తను బ్రతికి ప్రయోజనం లేదని వాళ్లు చెప్పేదేమీ వినకుండా అక్కడి నుంచి దూకేసింది. ఈ హఠత్పరిణామంతో ఆ ఇద్దరు యువకులు షాక్ తిన్నారు. వెంటనే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు తెలియజేసారు. తీవ్రంగా గాయపడిన యువతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు విషాదంగా మార్చేస్తాయి. తమనే నమ్ముకున్న కుటుంబాన్ని శోకంలో ముంచేస్తాయి. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి కానీ ఇలా అర్థంతరంగా, బలవన్మరణాలకు పాల్పడవద్దని, ఉజ్జ్వల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని పోలీసు వారు యువతీయువకులను అభ్యర్థిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్