Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇప్పుడే నా కోర్కె తీర్చేందుకు వచ్చేయమన్న ప్రియుడు, ఫోన్ స్విచాఫ్ చేసిన వివాహిత, అంతే...

Advertiesment
couple

ఐవీఆర్

, సోమవారం, 5 మే 2025 (14:48 IST)
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ వీటివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవడమే కాకుండా ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నాయి. తాజాగా ఓ వివాహిత పెట్టుకున్న వివాహేతర సంబంధం అతడి ప్రియుడితో పాటు తనను కూడా చంపేసింది. ఈ ఘటన శ్రీకాకుళంలోని లావేరు మండలంలో చోటుచేసుకున్నది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రమణ, మంగమ్మలు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నార. రమణ వ్యవసాయంతో పాటు పెళ్లికి మైకులు, విద్యుత్ దీపాలు పెడుతుంటాడు. అలా పచ్చగా వున్న వీరి మధ్యలోకి 25 ఏళ్ల లోకేష్ అనే యువకుడు ప్రవేశించాడు. అతడి మాటలు, పనులకు 32 ఏళ్ల మంగమ్మ ఆకర్షితురాలైంది. క్రమంగా అతడితో చనువు పెరిగిపోయి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త పనులపై దూర ప్రాంతానికి వెళ్లినప్పుడు లోకేష్ కి ఫోన్ చేసేది. అతడు మంగమ్మ కలిసి రాత్రంతా ఎంజాయ్ చేస్తుండేవారు.
 
ఐతే శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించిన లోకేష్... మంగమ్మకి ఫోన్ చేసాడు. తను సమీపంలోని తోటలో వున్నాననీ, ఇప్పటికిప్పుడు నా కోర్కె తీర్చేందుకు ఇక్కడకి వచ్చేయమని చెప్పాడు. అందుకు మంగమ్మ.. ఈ సమయంలో అది కుదరదు, తర్వాత చూద్దాంలే అంది. అయినప్పటికీ అతడు వదల్లేదు. నా కోర్కె తీర్చేందుకు నువ్వు రాకపోతే ఇక్కడ చచ్చిపోతానంటూ హెచ్చరించాడు. పదేపదే ఫోన్ చేస్తుండటంతో విసిగిపోయిన మంగమ్మ తన ఫోనుని స్విచాఫ్ చేసింది. అంతే... అది తట్టుకోలేని లోకేష్... తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు.
 
ఆదివారం ఉదయం తోట సమీపానికి వెళ్లిన స్థానికులకు లోకేష్ శవమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇంతలో మంగమ్మ భయంతో వణికిపోయింది. తనకు లాస్ట్ ఫోన్ కాల్ చేసింది లోకేషే కనుక అతడితో తనకు గల వివాహేతర సంబంధం బైటపడుతుందని భయపడి ఇంట్లో ఫ్యానుకి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరి మృతదేహాలను శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు