భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

ఠాగూర్
ఆదివారం, 10 ఆగస్టు 2025 (17:59 IST)
కట్టుకున్న భర్తతో గొడవలతో విసుగెత్తిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బండా జిల్లాలోని రిసౌరా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రిసౌరా గ్రామానికి చెందిన రీనా, అఖిలేశ్ అనే దంపతులుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి  భర్తతో గొడవ జరగడంతో పిల్లలను తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఉదయం లేచి చూడగా కోడలు, పిల్లలు కనిపించలేదు. 
 
దీంతో అత్తామామలు, ఇరుగు పొరుగువారు కలిసి వారి కోసం గాలించగా, ఊరికి శివారులో ఉన్న కెన్ కాలువ వద్ద దుస్తులు, గాజులు, చెప్పులు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు  వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. వారు గజ ఈతగాళ్ళతో వచ్చి కాలువలో గాలించగా మూడు మృతదేహాలను వెలికి తీశారు. మృతులను రీనా (30), హిమాన్షు (9), అన్షి (5), ప్రిన్స్ (3) అనేవారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments