కాపురంలో చిచ్చుపెట్టిన మనస్పర్థలు... ప్రాణాలు తీసుకున్న దంపతులు

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (13:23 IST)
హాయిగా సాగిపోతున్న తమ కాపురంలో ఓ చిన్న సమస్య చిచ్చుపెట్టింది. ఇది భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారితీసింది. దీంతో ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫలితంగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మియాపూర్‌కు చెందిన జంగం సందీప్ (30)కు, మంచిర్యాలకు చెందిన కీర్తి(26)కి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. అమీన్ పూర్ ఠాణాపరిధి బంధంకొమ్ములోని శ్రీధమ్ హిల్స్‌లో కాపురం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాప, 14 నెలల బాబు ఉన్నారు. ఆదివారం పాప పుట్టినరోజు విషయంలో గొడవ జరిగినట్లు తెలిసింది. 
 
అదేసమయంలో బయటకు వెళ్లిన సందీప్ తిరిగి ఇంటికి వచ్చేసరికి కీర్తి ఇంటి పైకప్పు సీలింగ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సందీప్.. కీర్తిని కిందకు దించాడు. తన తండ్రికి ఫోన్ చేసి కీర్తి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆ తర్వాత అదే సీలింగ్‌కు ఉరివేసుకొని సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో చిన్నారులు మియాపూర్‌లోని సందీప్ తండ్రి వద్ద ఉన్నారు. సోమవారం కీర్తి తండ్రి ప్రభాకర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments