Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలో డబ్బు తీసుకోవడం చేతకావడంలేదా... నేను తీసిస్తానంటాడు, అంతే కార్డు మారిపోతుంది

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (17:34 IST)
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులే అతని టార్గెట్. చదువుకున్న వారు ఎటిఎంలో డబ్బు తీసుకునే వారు అయితే పట్టించుకోడు. చదువుకోకుండా.. ఎటిఎంలో డబ్బులు తీసుకోవాలి అనుకుని అక్కడే తిరుగుతున్న వారే అతని టార్గెట్.

 
అలాంటి వారిని సులువుగా బురిడీ కొట్టిస్తాడు. వారి ఎటిఎం కార్డులను మార్చేస్తాడు. ఆ స్థానంలో డమ్మీ కార్డులు ఇస్తాడు. ఆ కార్డులన్నీ తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో డబ్బులను డ్రా చేస్తాడు. ఇలా లక్షల రూపాయలు డ్రా చేసుకుని జల్సా చేసి ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 
తిరుపతి ఈస్ట్ పోలీస్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం బాలసముద్రం గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి గత ఐదు సంవత్సరాలుగా ఎటిఎంల దగ్గర తిరుగుతూ డబ్బులు తీసుకోలేని వారికి డబ్బులు డ్రా చేసి ఇచ్చేవాడు.

 
డబ్బులు డ్రా చేసిన తరువాత వారికి వేరే ఎటిఎం కార్డులను ఇచ్చేవాడు. వారి ఎటిఎం కార్డుతో పాటు ఆ పిన్ నెంబర్లను గుర్తు పెట్టుకుని కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి డబ్బులు డ్రా చేసేవాడు. ఇలా తిరుపతికి వచ్చి ఎంతోమంది భక్తుల ఎటిఎం కార్డులతో లక్షల రూపాయలను డ్రా చేశాడు.

 
నిందితుడిని అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు అతని నుంచి 2 లక్షల 80 వేల రూపాయలతో పాటు 20 ఎటిఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కర్ణాటకలో మూడు కేసులు, తమిళనాడులో ఐదు కేసులు ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments