Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోవాలంటూ యువతికి వేధింపులు.. ఇంటికెళ్లి కత్తితో దాడికి యత్నం

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (09:29 IST)
తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధిస్తున్న యువకుడు ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె తల్లి, తాతపైనా దాడికి పాల్పడి చివరికి వారి చేతిలోనే హతమయ్యాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మల్యాల సీఐ దామోదర్‌ రెడ్డి, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కళ్లపల్లికి రాజేశం జీవనోపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు. భార్య సత్తవ్వ కుమార్తె(23)తో కలిసి అదే గ్రామంలోని తండ్రి నర్సయ్య వద్ద ఉంటోంది.
 
జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్‌(26) మూడేళ్లుగా సత్తవ్వ కుమార్తె వెంటపడి పెళ్లిచేసుకోవాలని వేధిస్తున్నాడు. ఈ విషయమై మల్యాల ఠాణాలో పలుమార్లు బాధితురాలు ఫిర్యాదు చేయగా 2022లో మహేశ్‌పై కేసు నమోదైంది. నాలుగు రోజుల కిందట యువతి జగిత్యాలలోని కళాశాలకు వెళ్లే సమయంలో దాడికి యత్నించడంతో మళ్లీ ఫిర్యాదు చేయగా మరోసారి కేసు నమోదైంది. అయినా తీరు మార్చుకోని మహేశ్‌ సోమవారం నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడికి యత్నించాడు. తాత, తల్లి అడ్డుకోవడంతో వారిపైనా దాడికి పాల్పడ్డాడు.
 
ప్రతిఘటించే సమయంలో మహేశ్‌ కిందపడగా వారు అక్కడే ఉన్న బండరాయితో తలపై కొట్టడంతో మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ నర్సయ్య, సత్తవ్వలను పోలీసులు జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. మహేశ్‌ తండ్రి ఫిర్యాదుతో యువతితోపాటు ఆమె అన్న, తల్లి, తాత, అమ్మమ్మలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అబ్దుల్‌రహీం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments