Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖమ్మంలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ స్టోర్‌ను ప్రారంభించిన సాయి సిల్క్స్ కళామందిర్

Varamahalakshmi Silks store in Khammam

ఐవీఆర్

, సోమవారం, 4 మార్చి 2024 (23:05 IST)
ఎథ్నిక్ అపెరల్ రిటైలర్ సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే దిశగా, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఫార్మాట్‌లో ఖమ్మంలోని  బైపాస్ రోడ్‌లో తమ 59వ స్టోర్‌ను ప్రారంభించింది. దీనితో పాటుగా కస్బా బజార్‌లో ఉన్న కళామందిర్ స్టోర్‌ను కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఫార్మాట్లోకి మార్చింది. ఈ స్టోర్‌ను శ్రీ త్రిదండి అహోబిల రామానుజున జీయర్ స్వామి ప్రారంభించారు. తెలంగాణలో సంస్థకు ఇది  26వ స్టోర్. ఈ స్టోర్ బనారసి, పటోలా, కోట, పైథాని, ఆర్గాంజ, కుప్పడం, కాంచీపురం పట్టుచీరలు వంటి ప్రీమియం ఎథ్నిక్ చీరలు-వివాహ, అకేషన్‌వేర్ కోసం హ్యాండ్లూమ్‌లను అందిస్తుంది.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో విస్తృత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ, అల్ట్రా-ప్రీమియం, ప్రీమియం చీరలు, లెహంగాలతో పాటుగా పురుషులు, పిల్లల సంప్రదాయ వస్త్ర శ్రేణి సహా అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది. సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి మాట్లాడుతూ, “ఈ ప్రాంతంలో రిటైల్ కార్యకలాపాలను విస్తరింపజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఇప్పటికే తెలంగాణాలో మమ్మల్ని సాదరంగా స్వాగతించారు. ఈ కారణం చేతనే ఇక్కడ మాకు అత్యధిక సంఖ్యలో స్టోర్లు వున్నాయి. ప్రణాళికాబద్ధమైన రిటైల్ విస్తరణ వ్యూహం ద్వారా, ఎత్నిక్ వేర్ మార్కెట్‌లో మా కార్యకలాపాలను విస్తరించడం ద్వారా వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నాము" అని అన్నారు. 
 
“2023 ఆర్థిక సంవత్సరంలో, తమ మొత్తం ఆదాయంలో 44.90%ను తెలంగాణ అందించిందని గుర్తించాము. తెలంగాణలో మరో అధ్యాయానికి తెరతీసే ప్రయాణాన్ని ప్రారంభించినందున, మా విజయ పథాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాము”అని ప్రసాద్ చలవాడి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?