Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నగ్నంగా కనిపించాలా? నువ్వు విప్పేస్తే నేను కూడా చూపిస్తా: ఆ లేడీల దెబ్బకు ఔట్

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (10:11 IST)
అసలే లాక్ డౌన్. చేస్తున్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. నగర జీవితానికి అలవాటు పడిన కొంతమంది తిరిగి వెళ్లి తమ సొంత ఊళ్లలో ఏదో చేతికి దొరికిన పని చేయడానికి ససేమిరా ఇష్టపడటంలేదు. దీనితో పక్కదారి పడుతున్నారు. ఇలా ఉద్యోగాలు పోయిన అమ్మాయిలపై హైదరాబాద్ నగరంలో ఓ ముఠా కన్నేసి వాళ్ల బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతోంది. వారినే అడ్డు పెట్టుకుని లక్షలకి లక్షలు లాగేస్తున్నారు. ఇంతకీ వీళ్లు చేస్తున్నది ఏంటయా అంటే...?
 
హైదరాబాద్ నగరంలో పలు కాల్ సెంటర్లలో పనిచేసే యువతులు ఈమధ్య లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటివారిని గుర్తించి వారినందరినీ ఓ ముఠాగా తయారుచేసాడు కృష్ణాజిల్లాకు చెందిన రెహమాన్ అనే యువకుడు. వారితో చేయరాని పనులు చేయించాడు.
 
అతడు ఇచ్చిన తర్ఫీదు ప్రకారం... ఈ అమ్మాయిలు తొలుత బాగా డబ్బున్న యువకులను టార్గెట్ చేస్తారు. ఫోనులో గారాలు పోతూ ప్రేమ నటిస్తూ అతడిని ముగ్గులోకి దింపేస్తారు. రొమాన్స్ టాక్ సరేసరి. మెల్లగా నన్ను సెక్సీగా చూడాలనుకుంటున్నావా... అలాగైతే దానికి ఇంత చెల్లించాలి అంటూ బేరం పెడతారు. యువకుడు ఆమె అందాలు చూసి బెండ్ అయితే మరికాస్త.. ఇంకాస్త అంటూ కవ్విస్తూ నగ్నంగా కనిపిస్తానంటూ వాట్సప్ లోకి వచ్చేస్తారు.
 
ఇక్కడే వాళ్ల ప్లాన్ మొదలవుతుంది. నేను నగ్నంగా కనిపించాలంటే ముందు నువ్వు కనిపించాలంటూ అతడి దుస్తులు విప్పించి అది కాస్తా రికార్డ్ చేసేస్తారు. ఇక అక్కడ్నుంచి అతడిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ వీడియోలను నెట్లో అప్ చేస్తామని బెదిరించి లక్షల్లో గుంజేస్తారు. ఇలాంటి కేసులు ఇటీవల హైదరాబాదులో నమోదయ్యాయి. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా వుండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments