Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయ్యాక అక్రమ సంబంధానికి దూరం.. ఆమెను హత్య చేసిన దంపతులు?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (09:54 IST)
అక్రమ సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తున్నాయి. తాజాగా ఆర్థిక అవసరాల కోసం బరితెగించి దంపతులిద్దరు అమాయక మహిళను హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ కేసులో పోలీసులు హత్య చేసి కట్టు కథ అళ్లిన దంపతులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ జీడిమెట్లలోని వినాయక నగర్‌లో ఝార్ఖండ్‌కు చెందిన రాజేశ్ వర్మ అనే యువకుడు గత అయిదు సంవత్సరాలుగా ఉంటున్నాడు.
 
 కాగా అదే కాంప్లెక్స్‌లోనే పక్కన సంజీత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. కాగా సంజీత్ నగరంలో ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. అవసరాలకు అప్పులు చేస్తూ జులాయిగా మారాడు. దీంతో ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఇంటిని పట్టించుకోకుండా సంజీత్ వ్యవహరించాడు.
 
దీంతో సంజీత్ భార్య తన అవసరాల కోసం పక్కనే ఉంటున్న రాజేశ్ వర్మతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో వారికి కావాల్సిన కుటుంబ అవసరాలను రాజేశ్ వర్మ తీరుస్తు ఉండేవాడు... అయితే గత ఆరు నెలల క్రితమే రాజేశ్ వర్మ జార్ఖండ్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్‌ నుండి హైదరాబాద్‌లోనే కాపురం పెట్టాడు. దీంతో.. పెళ్లి తర్వాత తన అక్రమ సంబంధానికి పుల్‌స్టాప్ పెట్టాడు. పక్కింటి సంజీత్ భార్యతో దూరంగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే రాజేశ్ అక్రమ సంబంధంతో పాటు సంజీత్ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు రాలేదు.
 
దీంతో రాజేశ్ వర్మకు భార్య రావడంతో తమకు ఆర్ధిక కష్టాలు వచ్చాయని సంజీత్ దంపతులు భావించారు. దీంతో ఆమెను కడతేర్చడం ద్వారా రాజేశ్‌ను తిరిగి దారిలోకి తెచ్చుకోవచ్చనే కుట్రకు తెరలేపారు. దీంతో నాలుగు రోజుల క్రితం రాజేష్ వర్మ ఉద్యోగానికి వెళ్లడంతో ఒంటరిగా నిద్రపోతున్న ఆయన భార్య ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
 
అనంతరం పోలీసులు రావడంతో కట్టుకథ చెప్పారు.. ఆమె ప్రియుడితో గొడవ పడిందని పోలీసులకు వివరించారు. ప్రియుడు రమ్మని చెప్పడంతో నిరాకరించిన ఆమెను హత్య చేశాడని వివరించారు. దీంతో సంజీత్ దంపతులు చెప్పిన స్టోరీపై అనుమానాలు వ్యక్తం చేసిన జీడిమెట్ల పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ చేపట్టారు. అయితే ఆ కెమెరాల్లో ఎవరు రాకపోవడంతో సాక్ష్యాలు సేకరించారు.దీంతో సంజీత్ దంపతులను తమ స్టైల్లో విచారించాడంతో అసలు విషయం ఒప్పుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments