Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చక్కగా సాగే సంసారంలో ఆటోడ్రైవర్ నిప్పు, వివాహితను లొంగదీసుకుని...

Advertiesment
చక్కగా సాగే సంసారంలో ఆటోడ్రైవర్ నిప్పు, వివాహితను లొంగదీసుకుని...
, గురువారం, 12 ఆగస్టు 2021 (20:30 IST)
పెళ్ళయ్యింది. 14 యేళ్ళ కొడుకు ఉన్నాడు. ప్రశాంతంగా సాగిపోతున్న కుటుంబం. కానీ ఆమె ప్రియుడి మోజులో పడిపోయింది. ప్రియుడే సర్వస్వంగా భావించింది. కుటుంబం వద్దనుకుంది. ప్రియుడితోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంది. ప్రియుడిని రెచ్చగొట్టి అతి దారుణంగా భర్తను చంపించింది.
 
తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలోని సోమంగళం పోలీసు స్టేషన్ పరిధిలోని అదానంచెరి ప్రాంతంలో తంగవేల్, విమలారాణిలు నివాసముంటున్నారు. వీరికి హరీష్ రాఘవ్ అనే 14 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. తంగవేల్ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. 
 
గత సంవత్సరకాలంగా విమలారాణి రాజా అనే యువకుడితో కలుస్తోంది. అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుస్తోంది. శారీరక సంబంధం కొనసాగిస్తోంది. రాజా ఆటోడ్రైవర్.. పెళ్ళి కాలేదు. విమలారాణి దంపతులు వుండే ప్రాంతంలోనే రాజా మకాం పెట్టాడు. ఎక్కడికన్నా వెళ్లాలంటే చాలా తక్కువ రేటుకే సవారీలో దించేవాడు. అంతేకాకుండా ఆటోలో వెళ్తున్నంతసేపు తీయటి మాటలు చెప్పేవాడు. విమలారాణి కాస్తా అతడి మాటలకు లొంగిపోయింది.
 
రాజాతో పరిచయం విమలకు కొత్తగా అనిపించింది. కుటుంబంతో విసిగిపోయిన ఆమె ఎలాగైనా సరే అతనితోనే జీవించాలనుకుంది. నీకు కావాల్సింది నేను ఇస్తున్నాగా.. నాకు కావాల్సింది నువ్వు చేస్తావా అంటూ ప్రియుడిని రెచ్చగొట్టింది. భర్త తంగవేల్‌ను అతి దారుణంగా హత్య చేయించింది. 
 
విమలపై కొడుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నాడు. దీంతో ప్రియుడు రాజా వ్యవహారాన్ని బయట పెట్టింది విమల. ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రియుడిని కూడా అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mamata Banerjee: కంటతడిపెట్టిన దీదీ.. కారణమిదే?