Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లికాని యువకులతో ప్రేమ నటిస్తూ శృంగారం, వీడియోలు తీసి వివాహిత బ్లాక్‌మెయిల్

Advertiesment
పెళ్లికాని యువకులతో ప్రేమ నటిస్తూ శృంగారం, వీడియోలు తీసి వివాహిత బ్లాక్‌మెయిల్
, గురువారం, 12 ఆగస్టు 2021 (19:51 IST)
ఇద్దరు పిల్లలు. వయస్సు పెద్దగా లేదు. చిన్నతనంలోనే వివాహం చేసేశారు. భర్తతో గొడవ. పిల్లలతో పాటు బయటకు వచ్చేసింది. పిన్నితో కలిసి ఉంటోంది. అయితే పిన్ని ఇచ్చే సలహాలతో యువకులను టార్గెట్ చేసి వారితో శృంగారంలో పాల్గొని వారిని బ్లాక్‌మెయిల్ చేయడం అలవాటుగా చేసుకుంది. 20 మందికిపైగా యువకులను బుట్టలో దింపి చివరకు అడ్డంగా దొరికిపోయింది.
 
హైదరాబాద్ కుషాయిగూడలో నివాసముండే రీతు అనే మహిళకు 8 సంవత్సరాల క్రితమే వివాహమైంది. ఈమెకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయి పిన్ని దగ్గరకు వచ్చేసింది. ఆమె దగ్గరే గత సంవత్సరంగా ఉంటోంది. కరోనా సమయంలో డబ్బులు లేకపోవడంతో పిన్ని ఒక ఐడియా ఇచ్చింది.
 
బాగా డబ్బున్న యువకులను ఫేస్ బుక్ ద్వారా తెలుసుకుని వారికి వల వేసి వారి దగ్గర డబ్బులు గుంజేద్దామని చెప్పింది. ఇలా 20 మందికి పైగా యువకులను బుట్టలో వేసుకుంది. వారితో శృంగారం చేసింది. వీరంతా పెళ్ళిళ్ళు కాని వారే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈమే శృంగార వీడియోలను తీసి మీ ఇంటికి పంపిస్తానంటూ బెదిరించేది. 
 
ఇలా యువకులను బెదిరించి డబ్బులు తీసుకునేది. అయితే ఎక్కువరోజులు ఇది సాగదుగా... సాగర్ అనే యువకుడు ఏకంగా మానవ హక్కుల కమిషన్‌కు ఈ విషయాన్ని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా కేసును సరిగ్గా పట్టించుకోవడం లేదని... ఫిర్యాదు చేసినా కూడా ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నారని వాపోయాడు.
 
దీంతో మానవహక్కుల కమిషన్ సీరియస్‌గా ఈ వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకోమని పోలీసులకు ఆదేశించింది. నిందితురాలిని విచారించాలని.. అలాగే ఆమె చేతిలో మోసపోయిన యువకుల నుంచి వివరాలను కూడా సేకరించాలని ఆదేశాలిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ను ఎన్నికల్లో ఓడించాలంటే వైఎస్ఆర్ స్నేహితుడితోనే సాధ్యమనుకుంటోందట కాంగ్రెస్