భర్త వద్ద సుఖం లేక.. చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ అక్రమ సంబంధం

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (11:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ.. తన భర్త వద్ద పొందలేని సంసార సుఖాన్ని చెత్త ఏరుకునే వ్యక్తితో పొందింది. దాంతో అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా, ఇరుగు పొరుగువారికి సందేహం రాకుండా ఈ వివాహేతర సంబంధాన్ని గుట్టుగా సాగిస్తూ వచ్చింది. అయితే, అక్రమ సంబంధం ఎపుడైనా బయటపడక ఉండదని పెద్దలు అంటుంటారు. అలా ఈ మహిళ అక్రమ సంబంధం కూడా బయటపడింది. 
 
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం, పటేల్ రోడ్డులో రెండు రోజుల క్రితం ఓ హత్య జరిగింది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 
 
పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో హతుడిని నాగరాజు (40)గా గుర్తించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన వాసిగా గుర్తించారు. షాద్ నగర్ పట్టణంలో నివసిస్తూ, రోడ్డు పక్కన చెత్త, చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి హత్యకు గురికాగా, శనివారం ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
 
పోలీసుల విచారణలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తేలింది. భర్తతో కలిసివుంటున్న ఆ మహిళ.. భర్త బయటకు వెళ్ళగానే చెత్త ఏరుకునే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తున్నట్టు తేలింది. ఈ విషయం ఇరుగు పొరుగువారి ద్వారా భర్త చెవిన పడింది. దీంతో భార్యను భర్త పలుమార్లు మందలించాడు. కానీ, ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు.
 
ఈ క్రమంలో నాగరాజు ఉండే పాడుబడిన ఇంటికెళ్లిన భర్త.. అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని అక్కడే వదిలివేసి వెళ్లాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగానే నాగారాజును హత్య చేసినట్టు తేలింది. దీంతో పరారీలో ఉన్న ఆ మహిళ భర్త కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments