Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

ఒప్పందం ప్రకారమే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు : కేంద్రం

Advertiesment
Piyush Goyal
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (15:55 IST)
గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) కుదుర్చుకున్న ఒప్పంద మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు కేంద్ర ఆహార శాఖామంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలు అంశంపై శుక్రవారం రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ సమాధానమిచ్చారు.
 
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ధాన్యం కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ ఒప్పందాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుండాలని కోరారు. ఆ లెక్కన తెలంగాణానే ఇంకా ధాన్యం పంపించాల్సి వుందని సభకు తెలిపారు. ధాన్యం కొనుగోలు అంశంలో తెరాస సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి గోయల్ వివరించారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు ఒప్పందం కుదిరిందన్నారు ఆ తర్వాత ఈ ఒప్పందాన్ని 44 లక్షల టన్నుల సేకరణకు పెంచామన్నారు. ఆ ప్రకారంగా ఇప్పటివరకు 27 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి వచ్చిందని, ఇంకా 17 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ రావాల్సి వుందన్నారు. ఒప్పందం ప్రకారం పంపించాల్సిన ధాన్యం పంపించకుండా కేంద్రాన్ని ప్రశ్నిస్తుండటం అర్థరహితంగా ఉందని మంత్రి సభలో వివరణ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలి: సోము వీర్రాజు