Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో ఒక్క ఒమిక్రాన్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు : మంత్రి మాడవీయ

Advertiesment
దేశంలో ఒక్క ఒమిక్రాన్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు : మంత్రి మాడవీయ
, మంగళవారం, 30 నవంబరు 2021 (15:07 IST)
ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ పాజిటివ్ కేసు ఒక్కటి కూడా మన దేశంలో ఇంకా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ కరోనా కొత్త వేరియంట్ ఇప్పటివరకు 14 దేశాలకు వ్యాపించిందన్నారు. అయితే, మన దేశంలోకి మాత్రం ఇంకా ప్రవేశించలేదన్నారు. పైగా, ఈ వైరస్ ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. పైగా, ఈ వైరస్ రాకుండా అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీపాల శేషాద్రి స్వామి పార్ధీవ దేహానికి ప్రముఖుల నివాళి