Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీపాల శేషాద్రి స్వామి పార్ధీవ దేహానికి ప్రముఖుల నివాళి

శ్రీపాల శేషాద్రి స్వామి పార్ధీవ దేహానికి ప్రముఖుల నివాళి
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 30 నవంబరు 2021 (14:59 IST)
తిరుమ‌ల  శ్రీవారి ఆలయంలో 43 సంవత్సరాలుగా సేవలందించిన శ్రీపాల శేషాద్రి స్వామి, డాలర్ శేషాద్రి పార్టీవ దేహానికి మంగళ వారం తిరుపతి  సిరిగిరి అపార్ట్ మెంట్ వద్ద సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించారు.

 
ప్రధాన న్యాయమూర్తి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శేషాద్రి స్వామి ఇక లేరు అన్నది నమ్మలేకపోతునాన్నని అన్నారు. శేషాద్రి స్వామితో 25 సంవత్సరాల అనుబంధం ఉంద‌ని, ఆయన మరణించడం త‌నకు వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పారు. దేవుడి సేవలో తరిస్తూ, ఆరోగ్యాన్ని కూడా  విస్మరించారని, ఆయన కోరిక మేరకు శ్రీవారి సేవలో వుండగానే చివరి శ్వాస విడి చారని అన్నారు. శేషాద్రి స్వామి రచించిన పుస్తకాలను టిటిడి ముద్రించి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని కోరారు.
 

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణతో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి పార్థ సారథి, ఏపి ప్రభుత్వ సలహాదారు అజేయ్ కలాం, తిరుపతి 3వ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బా రెడ్డి, టిటిడి ఈఓ డా. జవహర్ రెడ్డి, అదనపు ఈ ఓ ధర్మా రెడ్డి, టిటిడి పాలక మండలి సభ్యు లు పోకల అశోక్ కుమా ర్, క్రిష్ణమూర్తి, అనంత పురం డి ఐ జి క్రాంతి రాణా టాటా, తమిళనాడులోని టిటిడి అనుబంధ‌ ఆలయాల చైర్మన్ శేఖర్ రెడ్డి, మాజీ సి ఎస్ ల్.వి. సుబ్ర హ్మణ్యం, మాజీ జేఈవో లు పి. బాల సుబ్రహ్మ ణ్యం, శ్రీనివాస రాజు, టిటిడి జేఈవో సదా భార్గవి, సి వి ఎస్ ఓ గోపినాధ్ జెట్టి, తదితరులు వెంట ఉన్నారు.
 

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చంద్ర గిరి శాసనసభ్యులు, తుడా చైర్మన్ చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభి నయ్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డా.వెంగమ్మ, తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు, భాను ప్రకాష్ రెడ్డి, త‌దిత‌రులు నివాళులు అర్పించారు. మధ్యాహ్నం రెండు గంటలకు పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు హరిశ్చంద్ర స్మశాన వాటిక కు తరలించి అంత్య క్రియలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో ఒమిక్రాన్ కేసు ఒక్కటీ లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ