Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సొంత జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (09:42 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 
 
మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పులివెందుల అహోబిలాపురం వీధికి చెందిన నాగరాజు, లలిత దంపతుల కుమారుడు సోహిత్(11) ఖాజీపేట మండలం కొత్త పేటలోని బీరు శ్రీధర్రెడ్డి పాఠశాలలో 6వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం పాఠశాల సిబ్బంది నాగరాజుకు ఫోన్‌చేసి సోహిత్ కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, దీంతో బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి శరీరంపై గాయాలు గుర్తించి మృతదేహాన్ని పాఠశాల వద్దకు తీసుకెళ్లగా, సిబ్బంది గేటు వేసేయడంతో బయటే బైఠాయించారు. 
 
సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదంటూ బంధువులు పాఠశాల కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించిన రూరల్ సీఐ నరేంద్ర రెడ్డి ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఎట్టకేలకు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు బంధువులను ఒప్పించి కడప రిమ్స్‌కు తరలించారు. కాగా.. విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో బీరంరెడ్డి శ్రీధర్రెడ్డి పాఠశాలను తక్షణమే మూసివేయాలని డీఈవో రాఘవరెడ్డి ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments