కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో ఓ మెడికో హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లాలోని విశ్వభారతి వైద్య కాలేజీ హాస్టల్‌లో ఈ విషాదం జరిగింది. మృతుడిని నెల్లూరు జిల్లా కావలి వాసిగా గుర్తించారు. పేరు లోకేశ్‌గా గుర్తించారు.
విశ్వభారతి వైద్య భారతి వైద్య కాలేజీలో కావలికి చెందిన లోకేశ్ అనే విద్యార్థి ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఆదివారం అర్థరాత్రి ప్రాంతంలో తన గదిలోనే ఉరి వేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున మిగిలన విద్యార్థులు గమనించి తొలుత కాలేజీ యాజమాన్యానికి ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత మృతుని తండ్రి బ్రహ్మానందరావుకు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రేమ విఫలం కారణంగానే లోకేశ్ ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.