Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తత్కాల్ టిక్కెట్లతో భారీగా సొమ్ము చేసుకుంటున్న రైల్వే శాఖ

Advertiesment
Tatkal Ticket Charges Hike
, సోమవారం, 26 జూన్ 2023 (11:05 IST)
తత్కాల్ టిక్కెట్ల అమ్మకం ద్వారా రైల్వే శాఖ భారీగా సొమ్ము చేసుకుంటుంది. తత్కాల్ పేరుతో టిక్కెట్ ధరకు దాదాపు 90 శాతం మేరకు అదనంగా చెల్లిస్తుంది. రెగ్యులర్ టికెట్ ప్రాథమిక ధరపై కనీసం 30 శాతం అదనపు మొత్తాన్ని తత్కాల్ టికెట్లకు వసూలు చేస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. 
 
ఈ మొత్తం అనేక రైళ్లలో 80, 90 శాతం వరకు పెరుగుతోంది. సికింద్రాబాద్ - తెనాలి థర్డ్ ఏసీ ప్రాథమిక ఛార్జి రూ.610 అయితే 30 శాతం అదనంతో రూ.800.. రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ ఛార్జీలతో రూ.900 లోపే ఉండాలి. కానీ రూ.1,150 మేరకు వసూలు చేస్తుంది.
 
అదేవిధంగా స్లీపర్ క్లాస్‌లో రూ.100 - రూ.200, థర్డ్ ఏసీలో రూ.300- రూ.400, సెకండ్ ఏసీలో రూ.400-500 అదనంగా వసూలు చేస్తోంది. 200 నుంచి 400 కి.మీ. దూరం వరకు ప్రయాణించేవారిపై ఈ భారం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రైల్వేశాఖ ఏసీ తరగతులకు కనీస దూరంగా 500 కి.మీ. పరిగణనలోకి తీసుకోవడమే దీనికి కారణం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ ప్రారంభం