Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్‌తో తమ అంతర్జాతీయ విద్యా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆరుగురు విద్యార్థులు

Advertiesment
image
, శనివారం, 1 జులై 2023 (18:43 IST)
గ్లోబల్ ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ (GIIS) ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ అయిన గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్ (GCS) యొక్క 16వ ఎడిషన్ కోసం భారతదేశం నుండి ఆరుగురు, ఇతర దక్షిణాసియా దేశాల నుండి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌పై ఆసక్తిని కనబరిచిన 14,000 మంది విద్యార్థుల నుండి ఈ విద్యార్థులు ఎంపిక చేయబడ్డారు. విద్యార్థుల గత అకడమిక్ రికార్డుల మూల్యాంకనం మాత్రమే కాకుండా, ఎంపిక కావటానికి ముందు కఠినమైన ప్రవేశ పరీక్ష మరియు కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూలను కూడా ఎదుర్కొన్నారు.
 
ఎంపికైన విద్యార్థులు రాబోయే రెండు సంవత్సరాలు GIIS SMART క్యాంపస్ సింగపూర్‌లో గడుపుతారు, ఎంపికైన విద్యార్థులకు నెలవారీ స్టైఫండ్‌తో పాటు వసతి సౌకర్యాలు కూడా అందించబడతాయి. వీరు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. కోర్సు పూర్తయిన తర్వాత, విద్యార్థులు ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో వారి తదుపరి విద్యా ప్రయాణాన్ని ఎంచుకోవడం గురించి సలహా కూడా పొందుతారు. సింగపూర్‌కు వెళ్లడానికి ముందు, GIIS భాగమైన గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్ (GSF) ద్వారా గుర్గావ్‌లోని ఏరోసిటీలోని ఒక హోటల్‌లో ఈ విద్యార్థులను సత్కరించారు.
 
విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి, గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్, ఇండియా కంట్రీ డైరెక్టర్ శ్రీ ఆశిష్ తిబ్దేవాల్ మాట్లాడుతూ, “ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్‌లో భాగమైనందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నేను అభినందిస్తున్నాను. మా అత్యాధునికమైన సింగపూర్ SMART క్యాంపస్‌లో చదువుకోవడం వారి అకడమిక్, వ్యక్తిగత ఎదుగుదలకు కొత్త అవకాశాలను తెరిచి జీవితాన్ని మార్చే అనుభవంగా ఉంటుందని నేను భావిస్తున్నాను" అని అన్నారు 
 
కార్యక్రమం గురించి మరింతగా ఆయన మాట్లాడుతూ, “GCS ప్రోగ్రామ్ ప్రతిభావంతులైన విద్యార్థులకు గొప్ప అంతర్జాతీయ ఎక్స్పోజర్‌కు అందించడానికి ఉద్దేశించబడింది. మేము 11వ,12వ తరగతుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాము, ఎందుకంటే ఇది ఉన్నత విద్యలో విజయానికి ముఖ్యమైన గేట్‌వే.  అందువల్ల మేము వారి కలల కెరీర్‌కు సరైన లాంచ్‌ప్యాడ్‌గా ఉండే అత్యుత్తమ విద్యా నైపుణ్యం మరియు వనరులను వారికి అందించాలనుకుంటున్నాము" అని అన్నారు. 
 
“భవిష్యత్ సాంకేతికతలను స్వీకరించడంలో మేము అగ్రగామిగా ఉన్నాము. ఉన్నత-నాణ్యత జ్ఞానాన్ని అందించడంలో, విభాగాలను బలోపేతం చేయడంలో, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను మెరుగుపరచటంలో మేము ముందున్నాము. మా విద్యార్థులు అకడమిక్ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారు, జీవిత నైపుణ్యాలలో రాణిస్తారని సింగపూర్‌లోని గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్‌లోని అకడమిక్ క్వాలిటీ అస్యూరెన్స్ డైరెక్టర్ శ్రీ ప్రమోద్ త్రిపాఠీ అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రూప్‌-4లో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. ఎందుకిచ్చారంటే?