Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (09:10 IST)
తన భార్యకు ఫోను ద్వారా పొద్దస్తమానం మెసేజ్‌లు పంపుతున్న ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కట్టుకున్న భర్త.. చివరకు ఆ యువకుడి కుడిచేతిని నరికేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవద్దని, ఫోను సందేశాలు పంపొద్దంటూ పలుమార్లు హెచ్చరించినా ఆ యువకుడు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త.. ఆ యువకుడిపై కత్తితో దాడి చేసి చేతి వేలిని నరికేసాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏలూరు జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంకు చెందిన మజ్జి ఏసురాజు (26) అనే యువకుడు ఇటీవల హత్యకు గురయ్యాడు. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఏసురాజును ఆమె భర్త పలుమార్లు హెచ్చరించారు. కానీ, ఏసురాజు మాత్రం ఆ హెచ్చరికలను బేఖాతరు చేశాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉండి మండలంలోని అత్తింట్లో తన భార్య ఏసురాజు ఉండటాన్ని గమనించిన భర్త.. తట్టుకోలేకపోయాడు. 
 
వెంటనే తన తండ్రి, మరో వ్యక్తికి ఫోన్ చేసి వారిని అక్కడికి రప్పించారు. అందరూ కలిసి ఏసురాజును పట్టుకుని బావాయిపాలెం తీసుకెళ్లారు. అక్కడ ఏసురాజుపై దాడి చేశారు. తన భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడంటా ఏసురాజు కుడిచేతిని సగానికిపైగా నరికి దూరంగా పడేశాడు. ఆ తర్వాత ఏసురాజును కాపవరం పంట కాలువ రేవులో పడేసి అక్కడ నుంచి ముగ్గురు పారిపోయారు. కుడి చేతిని నరికివేయడంతో తీవ్ర రక్తస్రావమనైన ఏసురాజును ఎవరూ గమనించకపోవడంతో అపస్మారకస్థితిలోకి జారుకుని ప్రాణాలు విడిచాడు. ఈ కేసులో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments