తొలి భర్త ఆత్మహత్య చేసుకుంటే సినీ నటి పావని రెడ్డి త్వరలో రెండో పెళ్లి చేసుకోనుంది. 2013లో సీరియల్ నటుడు ప్రదీప్‌ను పావని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో ఇపుడు నృత్యదర్శకుడు అమిర్‌ను పావని రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
పలు తెలుగు సీరియల్స్‌తో పాటు ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా నటించింది. చారి 111, మళ్లీ మొదలైంది, గౌరవం, డ్రీమ్, డబుల్ ట్రబుల్ వంటి పలు చిత్రాల్లో నటించింది. తాజాగా పావని రెడ్డి రెండో వివాహానికి సిద్ధమైంది. కొరియోగ్రాఫర్ అమిర్‌తో ఆమె వివాహం ఈ నెల 20వ తేదీన జరుగనుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది.
2013లో పావని తొలి వివాహం జరిగింది. తెలుగు నటుడు ప్రదీప్ కుమార్‌ను పావని ప్రేమించి పెళ్లి చేసుకుంది.2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. పావని మరొకరితో చనువుగా ఉండటం వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, దీనిపై గురించి పావని ఏ నాడూ నోరు మెదపలేదు. ఇపుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది.
తమిళ బిగ్ బాస్ సీజన్-5లో పాల్గొన్న పావని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ అమిత్‌తో ఆమె ప్రేమలోపడింది. వీరిద్దరూ కలిసే ఉంటారన్న ప్రచారం కూ డా జరుగుతోంది. ఇపుడు పెళ్లితో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.